కుక్కలు మనుషుకుల మంచి దోస్తులనే సంగతి తెలిసిందే. కుక్కలు తమ యజమానులను ఎంతగా ప్రేమిస్తాయో.. యజమానులు కూడా వాటిని అంతగానే ప్రేమిస్తారు. ఈ క్రమంలో వాటికి ఏమైనా హాని కలిగినా.. కష్టమొచ్చినా తట్టుకోలేరు. పొరపాటున ఎవరైనా వాటిని కొడితే.. తమనే కొట్టినంతగా ఫీలవుతారు. ఇందుకు ఈ కుక్క యజమానుల మధ్య జరిగిన ఈ గొడవే నిదర్శనం. 


జర్మనీలో ఇద్దరు కుక్క యజమానుల మధ్య చోటుచేసుకున్న వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 27 ఏళ్ల యువతి పెంచుకుంటున్న కుక్కను 51 ఏళ్ల మహిళ కొట్టింది. దీంతో ఆ యువతి.. మహిళను నిలదీసింది. నీ కుక్కను కొడితే నువ్వు ఊరుకుంటావా అంటూ.. ఆమెతో గొడవపడింది. దీంతో ఇద్దరి మధ్య యుద్ధమే జరిగింది. ఆగ్రహానికి గురైన మహిళ.. యువతిని కొరికేసింది.


తమ యజమానులు కొట్టుకుంటుంటే.. వారి కుక్కలు మాత్రం వారిని అలా చూస్తుండిపోయాయి. మహిళ కరవడం వల్ల.. ఆ యువతి తన కుక్క మీద పడిపోయింది. దీంతో ఆమె కుక్క కూడా గాయపడింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. యువతిని కరిచిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఒకరినొకరు గాయపరుచుకున్నందుకు ఇద్దరినీ కోర్టు ముందు హజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. ఈ ఘటన గురించి తెలిసి.. కుక్కల కోసం మరీ ఇలా కుక్కల్లా కొట్టుకుంటారా అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. 


దాక్కో దాక్కో కుక్క.. పులొచ్చి కొరుకుద్ది పీక.. ఇక్కడ అదే జరిగింది, ఇదిగో వీడియో!: IFS అధికారి ప్రవీణ్ కాశ్వన్ శనివారం ట్వీట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనావాసాల్లోకి వచ్చిన ఓ పులి ఇంటి గేటు ముందుకు వచ్చి ఆహారం కోసం వెతకసాగింది. దానికి ఆ ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క కనిపించింది. అంతే.. అమాంతంగా గేటు దూకేసింది. దాన్ని చూడగానే కుక్క పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ, అప్పటికే ఆలస్యమైంది. పులి.. దాని పీకను నోటితో పట్టుకుని గోడ దూకి తీసుకెళ్లిపోయింది. వైరల్ వీడియో కోసం ఈ వార్త మీద క్లిక్ చేయండి.


Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్


Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!


Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)


Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి