మండి పోతున్న వేసవిలో శరీరానికి చలువ చేయాలంటే తాటిముంజలను తినాలి. ఇవి వేసవిలో అధికంగా శరీరానికి లభిస్తాయి. సీజనల్ గా దొరికే వీటిని కచ్చితంగా వేసవిలో తినాల్సిందే. వీటిని ఐస్ యాపిల్ అని పిలుస్తారు. వీటిలో ఓ రకం ‘తడ్గోలా’. ఇది మార్కెట్లో విరివిగా లభిస్తాయి. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి.  వీటిని తింటే శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. 


తాటి ముంజలు సహజమైన శీతలీకరణ లక్షణాలను కలిగి ఉన్న ఒక అద్భుతమైన పండు. వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి ఇవి ఉపయోగపడతాయి. వీటిలో అధిక నీటి కంటెంట్ ఉంటుంది. వీటిలో దాదాపు 95 శాతం నీరే ఉంటుంది. కాబట్టి వీటిని తింటే శరీరం నిర్జీలకరణం బారిన పడదు. వీటిలో పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఎండల వల్ల శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను ఇవి కాపాడతాయి. వేడి వల్ల వచ్చిన తీవ్ర అలసట నుంచి ఇవి కాపాడతాయి. ఇవి దాహాన్ని తీర్చడమే కాదు, శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ తాటి ముంజలలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. దీని వల్ల వాటిని ఎంత తిన్నా బరువు పెరిగే అవకాశం ఉంది. వీటిలో విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. శక్తిని పెంచుతాయి.


తాటి ముంజలు చూసేందుకు జెల్లీ-వంటి రూపంతో ఉంటుంది. వీటిని ఫ్రిజ్లో పెట్టి కాస్త చల్లగా అయ్యాక తింటే శీతలీకరణ లక్షణాలు త్వరగా కలుగుతాయి. దీనిలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది.   పురాతన భారతీయ వైద్య విధానం అయిన ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఉంది. ఆయుర్వేద సూత్రాల ప్రకారం, తాటి ముంజలు  తీసుకోవడం పిత్త దోషాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక వేడి వల్ల వచ్చే అసిడిటీ, చర్మపు దద్దుర్లు,  వడదెబ్బ వంటి వ్యాధుల నుండి ఇది ఉపశమనాన్ని అందిస్తుంది. దీని శీతలీకరణ లక్షణాలు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి. మీ సమ్మర్ డైట్‌లో దీన్ని భాగం చేసుకుంటే ఆరోగ్యానికి అన్నిరకాలుగా మేలు చేస్తుంది.  తాటి ముంజల్లో విటమిన్ ఎ అధికంగా ఉంది. వంద గ్రాముల ముంజల్లో 43 కేలరీలు ఉంటాయి. వాటిలో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్,ఫాస్పరస్, జింక్, ఐరన్  పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. 


Also read: డయాబెటిస్ ఉంటే ఈ పండ్లు అధికంగా తినకూడదు



























































Also read: నా కూతురు ముందే నా భర్త నన్ను కొట్టాడు, నేను అలానే చేయాలనుకుంటున్నాను


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.