evil eye signs: నరదిష్టికి నల్లరాళ్లయినా పగులుతాయని మన పెద్దలు చెబుతుంటారు. దిష్టికి అంత శక్తి ఉందట మరి. ఏ దిష్టి తగిలిందో ఇలా జరిగింది అని చాలామంది పెద్దవారు అంటూ ఉంటారు. మంచి ఆలోచనతో, నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్నట్టే.. ఈర్ష, ద్వేషంతో చూసే చూపునకు, చేసే ఆలోచనకు కూడా బలం ఉంటుందని విశ్వసిస్తుంటారు. మన చెడు కోరుకునేవారు చూసే చూపు మన జీవితంపై దుష్ప్రభావం పడేట్టు చేయగలుగుతుంది. ఇలా చెడు ఆలోచనలతో చూసే చూపుని చెడు దృష్టి లేదా నరదిష్టి అని పిలుస్తారు. నర దిష్టి జీవితంలో చాలా రకాల ప్రతికూలతకు కారణమవుతుంది.
మనలో చాలా మంది జీవితంలో వివరించలేని ఇబ్బందులను అనుభవిస్తారు. నర దిష్టి జీవితాలను చాలా కష్టతరం చేయడమే కాకుండా, మనం అర్థం చేసుకోవడానికి వీల్లేని సమస్యలను సృష్టిస్తుంది. ఎంత ప్రయత్నించినా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఎంత కృషి చేసినా చేపట్టిన పనులు విజయవంతంకావు. సాధారణంగా మీ విజయం లేదా ఆనందం పట్ల అసూయపడే వ్యక్తులు, మీకు హాని చేయాలనుకునే వ్యక్తుల చెడు చూపే దీనికి కారణం.
దిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలుపెట్టిన సరే ఆటంకాలు ఎదురవుతుంటాయి. అనుకున్న పని ఏది పూర్తి కాదు. ఇంకా చెప్పాలంటే దిష్టి తగిలిన వ్యక్తి తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటాడు. ప్రశాంతంగా ఉండలేకపోవడం, నిద్ర పట్టకపోవడం, అనవసరంగా గాభరాపడటం, ఏ పనిమీదా మనసు లగ్నం చేయలేకపోవడం, విపరీతమైన కోపం, అతిగా ఆలోచించడం, తగినంత విశ్రాంతి తీసుకున్నా నిస్సత్తువగా ఉండటం, ఆర్ఘిక సమస్యలతో సతమతమవడం వంటివి కూడా దిష్టి తగిలిందని చెప్పే సంకేతాలు.
నర దిష్టిని ఎదుర్కొనేందుకు చిట్కాలు
1. చెడు, దుష్ట శక్తుల నుంచి మన ఇంటిని కార్యాలయాన్ని రక్షించడానికి ఎండు మిరపకాయలు, నిమ్మకాయలను ఒక దారంలో కట్టి, ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వేలాడదీయడం మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో సర్వసాధారణం.
2. రెండు ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు లేదా నువ్వులు, కొద్దిగా ఉప్పు తీసుకోవాలి. నర దిష్టి బారిన పడిన వ్యక్తి తల చుట్టూ వాటిని 7 సార్లు వ్యతిరేక దిశలో తిప్పి, ఆపై వాటన్నింటినీ కాల్చివేయాలి.
3. తెల్లని గుడ్డను ఉపయోగించి సముద్రపు నీటిని వడకట్టి, ఆ నీటిని గోమూత్రంతో కలపండి. ఈ మిశ్రమాన్ని అమావాస్య, పౌర్ణమి నాడు ఇంట్లోని ప్రతి మూల చల్లాలి.
4. ఇంట్లో గర్భిణీ ఉంటే, ఆమె బయటకు వెళ్లినప్పుడల్లా వేప ఆకులను వెంట తీసుకెళ్లేలా చూసుకోవాలి. ఆమె తిరిగి వచ్చినప్పుడు ఈ ఆకులన్నింటినీ కాల్చేయాలి. అలాగే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద తెల్లటి అర్ధచంద్రాకారాన్ని ఉంచండి.
5. ఇంట్లో అక్వేరియం ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది నర దిష్టి ప్రభావాన్ని తొలగిస్తుందని చెబుతారు. ఒక గ్లాసులో కొద్దిగా నీరు తీసుకుని అందులో నిమ్మకాయ ఉంచి అందరికీ కనిపించే ప్రదేశంలో ఉంచాలి. ఇది చెడు దృష్టి ప్రభావాలను తొలగించడానికి సహాయపడుతుంది.
6. నర దిష్టి నుంచి రక్షించడానికి సహాయపడే కొన్ని వస్తువులు ధరించడం మన సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉంది. పసిబిడ్డలు, చిన్న పిల్లలకు దిష్టిపూసలు, చీలమండలో నల్లటి దారం కడతారు. దుష్ట కంటి తాయత్తులు. హంస దుష్ట కంటి నెక్లెస్, మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద దిష్టిబొమ్మ వేలాడదీస్తారు.
Also Read : మీకు ఇలా జరుగుతుంటే పితృ దోషం ఉన్నట్టే !
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.