గుల్లెడు సొమ్ములకంటే గుత్తెపు రవిక శృంగారం అని ఒక పాత కాలపు సామెత. అంటే విలువైన నగలు గంపెడు ధరించిన దానికంటే కూడా ఒక్క బిగుతైన రవిక ధరించడం వల్ల వచ్చే అందం మరింత శృంగారంగా ఉంటుందని అర్థం. అనాదిగా ఒంటికి అంటుకుని ఉండే దుస్తులు ధరించడం అందం అనే భావన ఉంది. అప్పట్లో టైట్ దుస్తులు ధరించడాన్ని తప్పుగా భావించేవారు. అయితే, ఈ రోజుల్లో అది సర్వసాధారణం. 


ట్రెండ్ అనుసరించడం అందరికీ ఇష్టం ఉంటుంది. ఫ్యాషన్ మాయలో పడి బిగుతైన దుస్తులు ధరిస్తూ వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఆలోచన కూడా చేయడం లేదు మనలో చాలామంది. దీర్ఘకాలం పాటు బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల రకరకాల అనారోగ్యాలు కలిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టైట్ దుస్తులు ధరించడం వల్ల కలిగే సమస్యలు ఇవే.


⦿ నడుము దగ్గర బిగుతుగా ఉండే దుస్తులు కడుపు మీద ఒత్తిడి పెంచుతాయి. అది జీర్ణసమస్యలకు కారణం కావచ్చు.


⦿ చర్మం ఇరిటేషన్ కలిగిస్తుంది.


⦿ దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి.


⦿ దుస్తులు కలిగించే ఒత్తిడి వల్ల చర్మం మీద కందిపోయిన గుర్తులు వస్తాయి.


⦿ కొన్ని దుస్తులు శ్వాస తీసుకోడానికి కూడా ఇబ్బందులు కలిగిస్తాయి. 


⦿ వ్యాయామం తర్వాత, స్విమ్మింగ్ తర్వాత వెంటనే దుస్తులు మార్చుకోకపోతే ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంటుంది.


⦿ టైట్ బెల్ట్ ప్యాంట్లు లేదా స్కర్టులు ధరించడం వల్ల చర్మం ఎర్రగా కందిపోతుంది. రక్తప్రసరణకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. 


⦿ బిగుతైన దుస్తులు అందంగా కనిపించవచ్చు. కానీ చర్మానికి ఇబ్బందిగా ఉంటుంది. అండర్ ఆర్మ్, కటి భాగంలో చర్మం ఒక దానితో ఒకటి తగిలే భాగాలలో మరింత ఇబ్బందిగా ఉంటుంది.


⦿ చర్మంలో చెమట, చర్మం నుంచి వచ్చే సీబమ్ ను బయటకు రాకుండా నిరోధిస్తాయి. అందువల్ల చర్మ రంధ్రాలు మూసుకుని పోయి మొటిమలు రావచ్చు. ముఖ్యంగా వీపు భాగంలో ఈ రకమైన సమస్య రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది.


⦿ బిగుతుగా ఉండే దుస్తుల చర్మం మీద ఒత్తిడి పెంచడమే కాదు రక్త ప్రసరణకు కూడా అంతరాయం కలిగిస్తాయట. ఫలితంగా నాడీ సమస్యలు వస్తాయి.


నిపుణులు ఏమంటున్నారు?


చర్మం శ్వాసించడానికి వీలుగా ఉండే దుస్తులు ధరించడం ఆరోగ్యానికి మంచిది. బిగుతుగా ఉండే దుస్తుల చర్మం మీద ఒత్తిడి పెంచడమే కాదు.. రక్త ప్రసరణకు కూడా అంతరాయం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల నాడీ సమస్యలు వస్తాయని అంటున్నారు. మరీ బిగుతుగా ఉండే దుస్తుల వల్ల అసౌకర్యం మాత్రమే కాదు, చర్మం ఇరిటేట్ అవుతుందని ఆమె చెబుతున్నారు. సహజమైన ఫైబర్ ఉపయోగించి చేసిన దుస్తులు ధరించడం ఆరోగ్యానికి మంచిది, ఇవి కాస్త బిగుతైనవైనా పెద్ద నష్టం ఉండదు. కానీ నైలాన్, రెసిన్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ధరించకపోవడమే మంచిదని ఆమె తెలిపారు. 


Also Read: అతిగా యోగా చేస్తున్నారా? ఎంత ప్రమాదకరమో తెలుసా?