కిస్ అనగానే మస్తు సిగ్గుపడిపోతాం. ముద్దుపై తెలుగులో ఎన్నో పాటలు.. ముద్దే పెట్టు.. ముద్దే పెట్టు.. అంటూ వచ్చే సాంగ్ ను చూసి మురిసిపోతాం. ముక్కుపై ముద్దు పెట్టు.. అనే సాంగ్ చూసి లోలోపల నవ్వుకుంటాం. ము..ము.. ముద్దంటే చేదా.. నీకా ఉద్దేశం లేదా అనే సాంగ్ చూసి.. పక్కన ఎవరైనా చూస్తున్నారా? లేదా? అని.. అబ్జర్వ్ చేస్తుంటాం. ఇవన్నీ వింటాం... గానీ.. ఇంతకీ కిస్ అనేది వేల ఏళ్ల క్రితమే పుట్టిందని తెలుసా..
3500 ఏళ్ల క్రితం నుంచే.. ముద్దు గురించి వర్ణించారు. అప్పుడు చుంబనం అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించినంటున్నారు.
అయితే కొంతమంది పరిశోధకులు చెప్పే మాట ఏంటంటే..ముద్దు అనేది.. మిలియన్ల సంవత్సరాల క్రితం పుట్టిందట. మానవుల్లో మెుదట నోటి నుంచి నోటికి ఆహారం అందించేవారని..., తల్లులు ఆహారం నమిలి పిల్లలకు తినిపించడం చేసేవారని అలా మెుదలై ఉంటుందని పరిశోధకుల అభిప్రాయం. అయితే ఈ ముద్దుల్లో రకరకాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. ప్రేమతో తల్లి పెట్టే ముద్దు వేరే ఉంటుంది. భార్యభర్తల నడుమ ఉండే ముద్దు వేరే ఉంటుంది. 'ఆమె నా నోటికి నోరు పెట్టి శబ్దం చేసింది.. అది నాలో ఆనందాన్ని కలిగించింది' అని చరిత్రలో ఓ గ్రంథంలో ఉంటుందట.
ఇంగ్లాండ్, ఐరోపాలో చాలా వరకు "ముద్దుల యుగం" 1600 ల మధ్య నుంచి చివరి వరకు ముగిసింది. దాని స్థానంలో సిగ్నల్స్ వచ్చాయట. దానికి ఓ కారణం ఉంది. లండన్‌లో 1665 లో వచ్చిన ప్లేగు.. వ్యాధి వ్యాప్తి చెందుతుందనే భయంతో చాలామందిని ముద్దుపెట్టుకోకుండా ఉండేవారట. తర్వాత 1760 మరియు 1840 నడుమ పారిశ్రామిక విప్లవం కాలంలో చేతి ముద్దు ఇంగ్లాండ్‌లో ప్రాచుర్యం పొందింది... చివరికి హ్యాండ్‌షేకింగ్‌గా మారింది.
పుట్టిన బిడ్డ తన పెదవులతో చనుబాలను తీసుకుంటుంది. అలా తల్లి స్థనాన్ని తాకడానికి.. ముద్దుకు మధ్య సంబంధం కూడా ఉంటుందని చెబుతారు కొంతమంది. ఆ సమయంలో తల్లి ప్రేమతో ముద్దు పెడుతుంది. ఇది చాలా మందికి తెలిసినదే. అందుకే ముందు ఓన్లీ శృంగార భరితమే కాదు. అందులో ప్రేమ, ఆప్యాయత, అనురాగం... ఇలా చాలా ఉంటాయి. పెదవులపై పెదవులను అదిమిపెట్టి గట్టిగా కిస్ ఇవ్వడం అనేది.. మానవ జాతికి మాత్రమే ఉన్న ప్రత్యేకత.
Also Read: Marriage With Sister : చెల్లిని పెళ్లి చేసుకున్న సూపర్ స్టార్ బైక్ రేసర్ ! చివరికేమయిందంటే..?