హీరో నితిన్ 30వ చిత్రం ‘మాస్ట్రో’ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సోమవారం ట్రైలర్ విడుదల చేశారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘అంధాధూన్’ సినిమాకు ఇది రీమేక్. ఇందులో నితిన్ అంథుడిగా కనిపించనున్నాడు. అయితే, తమన్నా ఇందులో హీరోయిన్ మాత్రం కాదు. ఇందులో ఆమె విలన్‌గా కనిపించనుంది. నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.
బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ‘మాస్ట్రో’కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఎన్.సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. హిందీలో ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. యువరాజ్ సినిమాటోగ్రాఫర్.
ప్రశాంతంగా మొదలయ్యే ట్రైలర్.. ఆ తర్వాత థ్రిల్లింగ్‌గా మారింది. అంథుడిగా సంగీతం వాయిస్తూ.. నభాను ప్రేమలో పడేస్తాడు. కానీ, తన జీవితంలో ‘‘సమ్‌థింగ్ ఈజ్ మిస్సింగ్’’ అనగా.. తమన్నా కష్టాల రూపంలో పలకరిస్తుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో నితిన్ ఓ హత్య గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్తాడు. ‘‘నువ్వు మర్డర్ చూశావా?’’ అని ఇన్‌స్పెక్టర్ అడిగే ప్రశ్నకు నితిన్ సమాధానమిస్తూ.. ‘‘నేను ఎలా చూడగలను సార్’’ అని అంటాడు. అప్పటి నుంచి అసలైన థ్రిల్ మొదలవుతుంది. తమన్నా.. ఓ మహిళను బిల్డింగ్ మీద నుంచి తోసేయడం.. ఆ తర్వాత నితిన్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం.. ఇలా సాగుతుంది ట్రైలర్. చివరిగా ‘‘అయినా ఏమిటో ఈ జీవితం. సినిమాల్లో మర్డర్ చూడటానికే భయపడే నేను. ఇప్పుడు మర్డర్ చేయాల్సి వచ్చింది’’ అనే తమన్నా డైలాగ్ ఆకట్టుకుంటుంది. చెప్పాలంటే.. ఈ ట్రైలర్‌లో తమన్నాయే ఎక్కువగా ఆకట్టుకుంటుంది. విలన్ క్యారెక్టర్‌ను ఆమె చాలా కూల్ హ్యాండిల్ చేసినట్లు కనిపిస్తోంది. ఆ ట్రైలర్‌ను మీరు కూడా చూసేయండి మరి.
‘మాస్ట్రో’ ట్రైలర్‌ను ఇక్కడ చూడండి:
తమన్నా ట్వీట్:
Also Read: ‘నాని.. నిజజీవితంలో హీరో కాదు, పిరికోడు’.. లైఫ్‌టైమ్ బ్యాన్ తప్పదు, ఎగ్జిబిటర్స్ షాకింగ్ నిర్ణయం!
Also Read: ఆర్జీవీ అదేం పని.. నటితో రొమాంటిక్ డ్యాన్స్, వైరల్ వీడియోలో ఉన్న ఆమె ఎవరు?
Also Read: శృంగారం లేకుండా ఉండగలవా? అభిమాని ప్రశ్నకు.. దిమ్మతిరిగే జవాబిచ్చిన శృతి హాసన్