కరోనా ప్రపంచాన్ని వణికించింది. తర్వాత మంకీపాక్స్, టమోటో ఫీవర్. ఇలా ఏదో ఒక వ్యాధి ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లల్ని రోగాల నుంచి కాపాడుకోవడం చాలా ముఖ్యం. వారికి వచ్చే మరో వ్యాధి HFMD అంటే హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డీసీజ్. ఇది ఎక్కువగా పిల్లల్లోనే కనిపిస్తుంది. ఏడు నుంచి పది రోజుల పాటు ఈ వ్యాధి లక్షణాలు ఉండి చిన్నారులను ఇబ్బందికి గురి చేస్తుంది. జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం మాత్రం ఉందని హెచ్చరిస్తున్నారు.
అసలు ఈ HFMD ఏంటి?
ఇది ఒక సాధారణ వైరల్ ఫీవర్ లాంటిది. ఎక్కువగా పిల్లల్లోనే కనిపిస్తుంది. తుమ్ములు, వ్యాధి సోకిన పిల్లలను ముట్టుకోవడం, వారి మలాన్ని పట్టుకోవడం వంటి వాటి ద్వారా వైరస్ ఇతరులకి వ్యాప్తి చెందుతుంది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల మీదే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. పెద్ద వాళ్ళకి కూడా ఇది సోకే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది కానీ చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల త్వరగా దాని బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కారణాలు, వ్యాప్తి ఎలా?
HFMD అనేది కాక్సాకీ వైరస్ జాతి వలన సంభవిస్తుంది. ఇది A౧౬ వైరస్ రకం. చేతులు కడుక్కోకుండా ఉండటం, వైరస్ ఉన్న ప్రదేశాలను తాకడం. డైపర్లు మార్చేటప్పుడు, వ్యాధి సోకిన పిల్లల మలం శుభ్రం చేసిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోకుండా ఆ హ్యాండ్స్ కళ్ళు, ముక్కు, నోటిని తాకడం వంటివి చెయ్యడం వల్ల ఇది వ్యాపి చెందుతుంది. వైరస్ సోకిన పిల్లలు పట్టుకున్న తలుపు గడియలు పట్టుకోవడం, బొమ్మలు తాకడం వంటివి చేసినప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ కి గురయ్యే అవకాశం ఉంది.
లక్షణాలు ఏంటి?
గుర్గావ్ ఫోర్టిస్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ పీడియాట్రిక్ విభాగం డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం ఈ వ్యాధి లక్షణాలు గొంతు నొప్పి, జ్వరం, ముక్కు కరటం, ఆకలి తగ్గడం, చిరాకు, తలనొప్పి, శరీరంపై ఎర్రటి బొబ్బలు, దద్దుర్లు ఉంటాయి. ఇవే కాదు నోటీలో బొబ్బలు, చేతులు, అరికాళ్ళపై ఎర్రటి దద్దుర్లు రావడం చీము కారడం కూడా జరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. జ్వరం వచ్చిన ఒకటి రెండు రోజుల తర్వాత ఇటువంటి ఎర్రటి బొబ్బలు రావడం జరుగుతుందని అంటున్నారు. ఇన్ఫెక్షన్ సోకిన మూడు నుంచి ఆరు రోజుయ తర్వాత లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది. జ్వరం, గొంతు నొప్పి HFMD ప్రధాన లక్షణాలు. బొబ్బలు మూడు రోజుల తర్వాత కనిపిస్తాయి.
చూసేందుకు ఇది కూడా టమోటో ఫీవర్ ని పోలి ఉంటుంది. టమోటో ఫ్లూ అనేది HFMD క్లినికల్ వేరియంట్ గా నిపుణులు నిర్ధారించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇన్ఫెక్షన్ సోకిన వారీ దుస్తులు, తినే పాత్రలు వేరుగా ఉంచాలి. దుస్తులు క్రమం తప్పకుండా వేడి నీటితో శుభ్రం చెయ్యాలి. ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడిన దద్దుర్లని వేడి నీటితో శుభ్రం చెయ్యాలి. వారీ శరీరం ఎప్పుడు హైడ్రేట్ గా ఉండేలా చూసుకోవాలి. నోటిలో వచ్చే పుండ్లు వల్ల వ్యయాలు తినలేరు, తాగలేరు. కానీ శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉండటం కోసం ద్రవపదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి. జ్వరం అదుపులో ఉండటానికి పారాసిటమాల్ వినియోగించాలి. ఏడు నుంచి పది రోజుల్లో ఈ లక్షణాలు తగ్గకపోతే వెంటనే వైద్యులని సంప్రదించాలి.
Also read: వీగన్ల కోసం శాకాహార గుడ్లు, వీటిని ఎలా తయారుచేస్తారంటే
Also read: మధుమేహులకు తెల్లన్నం ఎంత హాని చేస్తుందో చపాతీలు అంతే హాని చేస్తాయి, ICMR అధ్యయనం