PM Modi South Visit:


కేరళ నుంచి కర్ణాటకకు..


ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది పర్యటనకు సిద్ధమయ్యారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. ఇవాళ కేరళకు వెళ్లనున్న ప్రధాని...తరవాత కర్ణాటకకు వెళ్తారు. పూర్తిగా దేశీయంగా తయారు చేసిన IAC విక్రాంత్‌ను కేరళలోని కొచ్చిలో లాంచ్ చేయనున్నారు. ఆ తరవాత శ్రీ ఆది శంకర జన్మభూమి క్షేత్రాన్ని సందర్శించనున్నారు. కొచ్చి మెట్రోకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. కేరళ నుంచి కర్ణాటకకు వెళ్లనున్నారు. అక్కడ మంగళూరులోని రూ.3,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ సాయంత్రం 5.15 నిముషాలకు ప్రధాని మోదీ శ్రీ ఆదిశంకర జన్మభూమి క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆ తరవాత 6 గంటలకు కొచ్చి మెట్రో సహా ఇండియన్ రైల్వేస్‌కు సంబంధించిన రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేస్తారు. 


కొచ్చి మెట్రో రైల్ ఫేజ్‌-1 పనులు ప్రారంభించనున్నారు. పెట్టా నుంచి ఎస్‌ఎన్‌ జంక్షన్  వరకూ మొదటి దశలో మెట్రో అందుబాటులోకి రానుంది. ఫేజ్-2లో భాగంగా జేఎల్‌ఎన్ స్టేడియం నుంచి ఇన్‌ఫో పార్క్‌ మార్గంలో మెట్రో అందుబాటులోకి వస్తుంది. దాదాపు 11 స్టేషన్లు కవర్ అయ్యే విధంగా 11 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. కేరళ-ఎర్నాకుళం జంక్షన్, ఎర్నాకుళం టౌన్, కొల్లం రైల్వే స్టేషన్లను రీబిల్డ్ పనులకూ శంకుస్థాపన చేయనున్నారు. సెప్టెంబర్ 2న ఉదయం 9.30 నిముషాలకు IAC విక్రాంత్‌ను అధికారికంగా లాంచ్ చేస్తారు. కొచ్చి నుంచి నేరుగా మంగళూరుకు వెళ్లనున్నారు. అక్కడ పలు ఇండస్ట్రియలైజేషన్ ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేస్తారు. వీటి విలువ దాదాపు రూ.3,800 కోట్లు. న్యూ మంగళూర్ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలోని బెర్త్ నంబర్ 14ని మెకానిజేషన్ చేసే పనులూ ప్రారంభం కానున్నాయి. ఇవి కాకుండా మరో రూ.1000కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లకూ శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోదీ. 


Also Read: BJP Janasena : జనసేనను పరిగణనలోకి తీసుకోని బీజేపీ పెద్దలు ! మిత్రుల మధ్య దూరం పెరిగిందా ?


Also Read: Aamir khan: ‘లాల్ సింగ్ చడ్డా’ నష్టాలు, పెద్ద మనసు చాటుకున్న అమీర్ ఖాన్