మందుబాబులకు బీరు అనగానే జోష్ వచ్చేస్తుంది. సీజన్లతో సంబంధం లేకుండా సీసాలకు సీసాల బీర్లు ఖాళీ చేసేస్తుంటారు. అయితే బీరులో ఉండే ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో చాలామంది తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బీరుకు దూరం అవుతున్నారు. కానీ దాని రుచిని ఆస్వాదించాలి అనుకునేవారు నాన్ ఆల్కహాల్ బీర్లకు షిఫ్ట్ అవుతున్నారు. మరి ఇలా చేయడం కరెక్టేనా? అసలు నాన్ ఆల్కహాల్ బీర్స్ అంటే ఏమిటి? వీటిని ఎలా తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి మంచిగా కావా అనే విషయాలు తెలుసుకుందాం. 


ఈ మధ్యకాలంలో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ తీసుకునేందుకు యువత ఆసక్తి చూపిస్తున్నారు. మద్యం వల్ల కలిగే దుష్పరిణామాల నుంచి బయటపడేందుకే యువత ఈ తరహా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. అటు మద్యం తయారీ కంపెనీలు సైతం నాన్ ఆల్కహాలిక్ బీర్లను మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. వీటిని సాధారణ సూపర్ మార్కెట్లలో సైతం విక్రయిస్తున్నారు. దీని నుంచి సాంప్రదాయ బీరు రుచిలోనే ఉంటుంది. కానీ ఇందులో ఆల్కహాల్ శాతం సున్నా అవడం వల్ల మత్తు రాదు.. అయితే నాన్ ఆల్కహాలిక్  బీర్లను అధికంగా సేవించడం వల్ల కూడా దుష్పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు తాజా అధ్యయనంలో తేల్చారు. 


నాన్ ఆల్కహాలిక్ బీర్లలో ఆల్కహాల్ లేకపోవడం వల్ల బ్యాక్టీరియా చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ కలిగించే ఈ కొలి, సాల్మొనెల్ల వంటి బ్యాక్టీరియాలు ఈ నాన్ ఆల్కహాలిక్ బీర్లలో ఉండే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఫుడ్ పాయిజనింగ్ కలిగించే అవకాశం ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. నాన్ ఆల్కహాలిక్ బీర్లలో ఉండే ఈ బ్యాక్టీరియా మూడు నెలల వరకు యాక్టివ్ గా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. 


ఈ నాన్ ఆల్కహాలిక్ బీర్లకు బదులుగా పరిమిత మోతాదులో సాధారణ బీర్లను తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది అని అమెరికాలోని కార్నల్ వర్సిటీకి చెందిన డాక్టర్ చార్లెస్ చెబుతున్నారు. ఆల్కహాల్ బీర్లలో కన్నా కూడా నాన్ ఆల్కహాల్ బీర్లలోనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుందని తాజా పరిశోధనలో తెగింది. ఈ నేపథ్యంలో నాన్ ఆల్కహాలిక్ బీర్లకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 


ఒకవేళ మీరు పార్టీల్లో పాల్గొనాలి అనుకున్నట్లయితే.. సాధారణ ఆల్కహాల్ బీర్లనే పరిమిత మోతాదులో సేవిస్తే మంచిదని సైతం నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే మార్కెట్లో ప్రస్తుతం నాన్ ఆల్కహాలిక్ బీర్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది వీటి ఉత్పత్తి పెరుగుతోంది. అయితే నాన్ ఆల్కహాలిక్ బీర్లకు బదులుగా పార్టీల్లో  ఇతర నాన్ ఆల్కహాలిక్  డ్రింక్స్ కు పరిమితం అయితే మంచి దాని సైతం నిపుణులు చెబుతున్నారు.


Also Read : సెల్‌ఫోన్‌తో సంతాన సమస్యలు - అబ్బాయిలూ మీరు ఈ రిస్క్ చేస్తున్నారా?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.