Dry Eye Syndrome : డ్రై ఐస్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? నివారణ ఎలా?

ఈ రోజుల్లో ల్యాప్‌టాప్, మొబైల్, టీవీ వంటి వాటిని ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల ‘డ్రై ఐ’ సిండ్రోమ్ చాలా సాధారణ సమస్యగా మారింది. కళ్లకు ఎక్కువసేపు పూర్తి తేమ అందకపోతే దురద, నీరు కారడం వంటి సమస్యలు వస్తాయ్.

Continues below advertisement

మధ్యకాలంలో చాలామందిలో కనిపిస్తున్న కంటి సమస్యల్లో డ్రై ఐస్ సిండ్రోం కూడా ఒకటి. దీని కారణంగా ఈ రోజు చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డ్రై ఐ సిండ్రోమ్‌ వ్యాధి సోకినప్పుడు కళ్ళు పొడిబారడం ప్రారంభిస్తాయి. కళ్లలో కన్నీటి ఉత్పత్తి ప్రక్రియలో ఇబ్బందులు ఏర్పడి ఈ సమస్య ఏర్పడుతుంది. అయితే, డ్రై ఐస్ సిండ్రోం ద్వారా దృష్టి సంబంధిత సమస్యలను ఏర్పడవు. కానీ ఇందులో అనేక ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. వీటిని సమయానికి గుర్తించి చికిత్స ప్రారంభించాలి. డ్రై ఐ సిండ్రోమ్‌ను మెడికల్ పరిభాషలో కెరాటోకాన్జూంక్టివిటిస్ అని కూడా పిలుస్తారు.

Continues below advertisement

ఆరోగ్యకరమైన కన్ను నిరంతరం కన్నీటిని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని టియర్ ఫిల్మ్ అంటారు. కన్నీటిని విట్రస్ ఫ్లూయిడ్ అని కూడా పిలుస్తారు. ఇది మీ కంటిలో ఉత్పత్తి అయ్యే స్పష్టమైన జెల్ లాంటి పదార్థం. ఇందులో 99.9 శాతం నీరు ఉంటుంది. మిగిలిన 0.1 శాతం చక్కెరలు, విటమిన్లు, ప్రోటీన్లు,  ఇతర మినరల్స్ ఉంటాయి. 

రెప్పలు వేసినప్పుడు. అలా మన కళ్లు నిత్యం ద్రవంలో తేలియాడుతుంటాయి. దీని వల్ల కళ్లు పొడిబారకుండా, చూపు స్పష్టంగా కనిపిస్తుంది. కన్నీటి గ్రంథులు తక్కువ కన్నీళ్లను ఉత్పత్తి చేస్తే, టియర్ ఫిల్మ్ అస్థిరంగా మారుతుంది. కన్నీటి ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్నప్పుడు, కళ్ళు పొడిగా మారుతాయి. ఇది కాకుండా, ఔషధాల వినియోగం, పర్యావరణ కాలుష్యం, అలాగే కనురెప్పల సమస్యల కారణంగా కూడా డ్రై ఐస్ సిండ్రోం సమస్య తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

డ్రై ఐస్ సిండ్రోమ్ లక్షణాలు ఇవే:

అస్పష్టమైన దృష్టి:

డ్రై ఐస్ సిండ్రోం మీ దృష్టిలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. ప్రత్యేకించి కంప్యూటర్‌ను అధికంగా చూడటం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. 

కాంతి సున్నితత్వం:  

డ్రై ఐస్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులకు కాంతిని చూడటం ఇబ్బందిగా  మారే అవకాశం ఉంది. ప్రకాశవంతమైన లైట్లు,  ప్రత్యక్ష సూర్యకాంతిని చూసినట్లయితే ఈ సమస్య మరింత పెరుగుతుంది.

కంటి పుసులు:

మీ కళ్ల మూలల్లో, ముఖ్యంగా ఉదయం మేల్కొన్నప్పుడు మందపాటి పుసులు ఏర్పడతాయి. ఇది తీవ్రమైన పొడి కంటికి సంకేతం కావచ్చు.

డ్రై ఐస్ సిండ్రోం నివారణ మార్గాలు ఇవే:

- గాలి లేదా వేడి గాలి నుంచి మీ కళ్ళను రక్షించడానికి చుట్టు అద్దాలు ధరించండి.

- టీవీ, మొబైల్, కంప్యూటర్ చూస్తున్నప్పుడు మీ కనురెప్పలను తరచుగా రెప్పవేయండి.

- ధూమపానం తీసుకోవడం తగ్గించండి, పొగతాగే వ్యక్తుల దగ్గర నిలబడకండి.

- సాధారణ గది ఉష్ణోగ్రతను నిర్వహించండి.

- కృత్రిమ కన్నీళ్లు మరియు కంటి చుక్కలను ఉపయోగించండి.

- కంటి పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి.

- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, ఇందులో ఒమేగా -3 మరియు 6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వాల్‌నట్‌లు, అవిసె గింజలు, చేప నూనె, సోయాబీన్స్, ఆలివ్ నూనె, గుమ్మడి గింజలు మొదలైన వాటిని తీసుకోండి.

Also Read : పచ్చి మిరపకాయలు చెడిపోతున్నాయా? ఇలా చేస్తే వారం రోజులు తాజాగా ఉంటాయ్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Continues below advertisement