పచ్చిమిర్చి లేకుండా వంట చేయలేము. వంట మరింత రుచిగా ఉండాలంటే పచ్చిమిర్చి ఉండాల్సిందే. ఉదయం మార్కెట్ నుంచి తీసుకువచ్చిన కూరగాయలు సాయంత్రానికి వాడిపోతాయి. ఫ్రిడ్జ్ లో పెట్టినా కానీ ఫ్రెష్ గా ఉండవు. వాటిలో పచ్చిమిర్చికూడా ఒకటి. చాలా మంది వారం పదిరోజులు సరిపడే విధంగా పచ్చిమిర్చి కొనుగోలు చేస్తుంటారు. కొన్నిసార్లు తక్కువ రేటుకు వస్తుందని ఎక్కువగా కొంటారు. కానీ వేసవికాలంలో పచ్చిమిర్చి త్వరగా పాడువుతుంది. కొన్ని రోజులకు పచ్చిమిర్చి కాస్త ఎర్రగా మారిపోయి తాజాదనం కోల్పుతోంది. కొన్ని కుళ్లిపోతాయ్, మరికొన్ని సాగుతాయ్. మిర్చి తాజాదనాన్ని ఎక్కువ కాలం ఉంచాలంటే కాస్త కష్టమైన పనే. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే పచ్చిమిర్చిని తాజాగా ఉంచవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం. 


ముందుగా పచ్చిమిర్చిని కొనుగోలు చేసేటప్పుడు ముడతలు, మచ్చలు లేకుండా తాజాగా ఉన్నవాటిని తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని స్టోర్ చేసేటప్పుడు తడిగా లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే తడిగా ఉన్న మిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. 


పచ్చి మిర్చి చెడిపోకుండా కాపాడుకోవడం ఎలా?


1. పచ్చి మిరపకాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ముందుగా మిరపకాయలను నీళ్లతో బాగా కడగాలి.


2. మిరపకాయలు ఎండిపోయినప్పుడు, వాటి కాడలను తీసివేయండి.


3. పాడైపోతున్న మిరపకాయలను తీసి పక్కన పెట్టుకోవాలి.


4. ఇప్పుడు అన్ని మిరపకాయలను పేపర్ టవల్ మీద ఉంచి వాటిని తడి లేకుండా చూడండి.


5. ఇప్పుడు మిరపకాయను పేపర్ టిష్యూలో చుట్టి, ఫ్రిజ్‌లో జిప్‌లాక్ బ్యాగ్‌లో నిల్వ చేయండి.


6. మీకు కావాలంటే, మీరు దానిని కాగితంతో కప్పి ఎయిర్ టైట్ బాక్స్‌లో కూడా నిల్వ చేయవచ్చు.


7. రిఫ్రిజిరేటర్  చలి నేరుగా మిరపకాయలను ప్రభావితం చేయదని గుర్తుంచుకోండి.


8. ఈ విధంగా మీరు మిరపకాయలను రెండు వారాల పాటు నిల్వ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మిరపకాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.


పచ్చిమిర్చిని నెలపాటు నిల్వచేయాలంటే?


పచ్చిమిర్చిని నెలపాటు నిల్వచేయాలంటే ముందుగా వాటిని శుభ్రంగా కడగాలి. అందులో కుళ్లిపోయిన మిర్చిని తీసేయ్యండి. ఎందుకంటే అవి మిగిలిన మిర్చిలను పాడుచేస్తాయి. వీటిని పేపర్ టవల్ పై ఆరబెట్టి..తొడిమలు తీయండి. గాలి చొరబడని డబ్బాలో  పేపర్ టవల్ వేసి పైన మిర్చి వేయాలి. దాని మరొక పేపర్ టవల్ వేయాలి. ఇప్పుడు మూతపెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి నిల్వ చేయండి. ఇలా చేస్తే మిర్చి నెలపాటు పాడవ్వకుండా తాజాగా ఉంటాయి. 


ఏడాదిపాటు నిల్వ ఉండాలంటే?


వారం రోజులు ఉండని మిర్చి...ఏడాది పాటు ఎలా ఉంటుందని ఆశ్చర్యంగా అనిపిస్తుందా? పచ్చిమిర్చి ఏడాదిపాటు నిల్వఉండాలంటే టీస్పూన్ వెనిగర్ నీళ్లలో వేయండి. ఈ నీటిలో మిర్చిని వేసి కాసేపు ఉంచండి. ఇప్పుడు నీళ్లతో శుభ్రం చేసి..పేపర్ టవల్ పై ఆరబెట్టండి. ఆ తర్వాత మిర్చితొడిమలు తీయండి. వీటిలో కుళ్లిపోయిన మిర్చిలను వేరు చేయండి. ఆ తర్వాత జిప్ లాక్ బ్యాగ్, ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్ లో స్టోర్ చేయండి. 


పచ్చి మిరపకాయలను నూనెతో కూడా నిల్వ చేసుకోవచ్చు. ఎలా అంటే... కొద్దిగా ఆవాలు లేదా కూరగాయల నూనె తీసుకోండి. నూనెను వేడి చేసి, అది వేడెక్కిన తర్వాత, దానిని చల్లబరచండి. పచ్చిమిరపకాయలన్నీ ఒక పాత్రలో వేసి చల్లారిన నూనెలో వేయాలి. అందులో మిరపకాయలు పూర్తిగా నానబెట్టాలి. కూజాను గట్టిగా మూసివేసి రిఫ్రిజిరేటర్‌లో పెట్టండి. ఈ చిట్కాలు ఫాలో అవుతే పచ్చిమిర్చి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. 


Also Read : రోజూ హాట్ వాటర్ టబ్‌లో స్నానం చేస్తే ఆసుపత్రికి వెళ్లాల్సిన పనిలేదు.!