Women Problems: హిందూ ధర్మశాస్త్రాల్లో చెప్పిన ప్రతి విషయానికి ఒక శాస్త్రీయ కోణం ఉంటుంది. పాపం, పుణ్యం, పవిత్రం, అపవిత్రం వంటి మాటలు ఉపయోగించడం వల్ల చాదస్తంగా కనిపించినప్పటికీ వాటి వెనుక కచ్చితంగా సైంటిఫిక్ కారణాలు ఉంటాయి. ఆ సూక్ష్మాలు గ్రహించలేని వారు వాటిని విమర్శిస్తుంటారు. నెలసరి అనేది చాలా సందర్భాల్లో ఒక వివాదాస్పద విషయంగా ఉంటూనే ఉంది. అది మహిళల పట్ల చూపే వివక్షగా కొందరు అభివర్ణిస్తారు. మరికొందరు చాదస్తం అని కొట్టిపారేస్తారు. నెలసరి నిబంధనలు పాటించాలా? వద్దా? దీని వెనుకు కూడా సైంటిఫిక్ కోణం ఉందా? ఉంటే ఏమిటది?


ప్రతినెల ఓ ఐదు రోజుల పాటు స్త్రీలందరూ నెలసరి ఇబ్బంది అనుభవించాల్సిందే. అదీ కాకుండా కొన్ని కుటుంబాల్లో తప్పకుండా నియమబద్ధంగా ఉండాలని నిబంధనలు కూడా పెడతారు. ఇవి చాలా సార్లు ఆ స్త్రీలకు మాత్రమే కాదు, కుటుంబంలో అందరికీ ఎంతో కొంత ఇబ్బంది కలిగిస్తూనే ఉంటాయి. కొందరు ప్రగతి శీల భావాలున్నవారు దీన్ని వ్యతిరేకిస్తారు కూడా. కానీ పండితులు నెలసరిలో ఇలా నిబంధనలు విధించడం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు. కొన్నింటి గురించి తెలుసుకుందాం.


తలస్నానం చేయకూడదా?


నెలసరి మొదటి మూడు రోజుల్లో తలస్నానం చెయ్యకూడదని కూడా శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే నెలసరి సమయంలో మందంగా పెరిగిన ఎండోమెట్రియం ఫలధీకరణ జరగదు. కనుక అండంతో పాటు రక్తస్రావంలో శరీరం నుంచి వెళ్లిపోవడం అవసరం. లేకపోతే చాలా రకాల సంతాన సాఫల్య సమస్యలు వస్తయి. తలమీద నుంచి నీళ్లు పోస్తే శరీరంలో రక్త స్రావం ఆగిపోతుంది. నెలసరి సమయంలో పూర్తిస్థాయిలో రక్తస్రావం జరగడం అవసరం కనుక మొదటి మూడు రోజులు తలస్నానం చెయ్యడం హిందు ధర్మ శాస్త్రంలో నిషేధం.


కోవెల ప్రవేశం నిషేదం


నెలసరి సమయాల్లో గుడి గోపురాలకు వెళ్లకూడదని చాలా స్ట్రిక్ట్ గా చెబుతారు. ఇలా వెల్లడం పాపం అని కూడా అంటారు. పాతకాలంలో కోవెలలు అన్నీ కూడా ఊరికి కాస్త దూరంగా ఉండేవి. ఉదయాన్నే గుడికి వెళ్లేందుకు బయటకు వెళ్తే క్రూరమృగాలు రక్తం వాసన పసిగట్టి దాడిచేసే ప్రమాదం ఉంటుందనేది దీని వెనుకున్న కారణం. అందుకని గుడిలో దైవదర్శనాన్ని నిషేధించారు.


ఇంట్లో కూడా దేవుడి పూజ, పితృ కార్యలు అంటే రకరకాల పనులు ఉంటాయి. ఆ సమయంలో స్త్రీల మానసిక శారీరక స్థితి అలా పనులు చేసేందుకు సిద్ధంగా ఉండదు. కనుక వారిని దైవసంబంధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పారు. అంతేకాదు ఈ సమయంలో స్త్రీ శరీరం ఒక లోఫ్రీక్వెన్సీలో ఉంటుంది. దేవాలయాల ఫ్రీక్వెన్సీ చాలా హై వైబ్రేషన్ లో ఉంటుంది. రెండింటి మధ్య వ్యత్యాసం అనారోగ్యాలకు కారణం కావచ్చు. కనుక ఒక నాలుగైదు రోజులు ఇలాంటి పనులన్నింటికి దూరంగా ప్రశాంతంగా గడపడం అవసరం. దైవకార్యలు చెయ్య కూడదు. కానీ దైవనామ స్మరణ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు.


Also read : అయోధ్య రామ మందిరం చూసేందుకు వెళ్తున్నారా? ఈ రూల్స్ తప్పక పాటించాలి