Krishna Mukunda Murari Today Episode: భవానితో పాటు అందరూ కింద కూర్చొని భోజనం చేస్తారు. వంటలన్నీ బాగున్నాయి అని అందరూ కృష్ణని పొగిడేస్తారు. అయితే ఆ వంటలు అన్నీ తాను చేయలేదు అని ముకుంద చేసింది అని కృష్ణ చెప్తుంది. ఇక అందరూ ముకుందను పొగుడుతారు. రేవతికి భవాని తినిపిస్తుంది. భోజనం తర్వాత అందరూ ఒక చేసి ఆటలు ఆడుతారు. గౌతమ్, మధులు బల ప్రయోగం చేస్తారు. ఇక భవాని అక్కడికి రావడంతో మధు, గౌతమ్ కంగారుపడి లేచేస్తారు. ఇక భవాని అందరి కోసం కొత్త బట్టలు కొంటుంది. వాటిని రేవతి తీసుకొస్తుంది. భవాని అందరికీ పంచుతుంది. కృష్ణకి ఇవ్వడంతో కృష్ణ చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక భవాని అందరికీ ఇచ్చి ముకుందకు ఇవ్వకపోవడంతో ముకుంద ఫీలవుతుంది.


కృష్ణ: పెద్దత్తయ్య ముకుంద ఫీలవుతుంది పాపం కదా.. మీరు ఇవ్వకండి నేను ఇస్తాను సరేనా..
భవాని: సరే సరే అందరూ రేపు ఇవే కట్టుకోండి..


మురారి: కృష్ణ నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఏమైపోయేవాడిని. అసలు కృష్ణ నన్ను కలవకపోతే ఎలా ఉండేదో.. నీకో మాట చెప్పాలి కృష్ణ. ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే అసలు నిన్ను పెళ్లే చేసుకోకపోయి ఉంటే ఎలా ఉండేది. 
కృష్ణ: ఇదేం ప్రశ్న ఏసీపీ సార్. 
మురారి: అట్లుంటది మనతోటి.. ఇప్పుడు చెప్పు.
కృష్ణ: ఏంటి చెప్పేది అర్థం పర్థం లేని ప్రశ్నలు మీరు. మనమిద్దరం భార్యభర్తలు అని ఆ దేవుడు రాశాడు అయ్యాం. ఒకవేళ మీరు అన్నట్లు మీరు మా ఊరు రాకపోయి ఉంటే నేను మీ ఇంటికి వచ్చేదాన్నేమో. అంతేకాదు దాన్ని తలరాత అంటారు. నా తలరాత మీరే.. నా చేతిరాత మీరే.. నా నుదిటి రాత మీరే.. మీరు లేకపోతే ఈ తింగరిది ఎక్కడుంటుంది చెప్పండి.


కృష్ణ పాలు తీసుకొస్తా అని గాసు బొమ్మ పగలగొట్టేస్తుంది. దాన్ని మా డిపార్ట్‌మెంట్ వాళ్లు ఇచ్చారు పగలగొట్టేశావా అని మురారి అడుగుతాడు. అందుకోసం పనిష్మెంట్ నువ్వు తీసుకుంటావా.. నేను ఇవ్వాలా అని  మురారి కృష్ణని అడుగుతాడు. పనిష్మెంట్‌గా ముద్దు ఇమ్మని చెప్తాడు. కృష్ణ మురారిని అద్దంలో ముద్దు పెడుతుంది. ఇక అందరూ భవాని ఇచ్చిన కొత్త బట్టలు వేసుకుంటారు. మురారి పంచె కట్టుకోలేక ఇబ్బంది పడతాడు. ఇక మురారికి కృష్ణ పంచె కడుతుంది. అందరూ హాల్‌లోకి చేరుకోవడంతో పూజ ప్రారంభిస్తారు. ఇక సంక్రాంతి పండగ గురించి ఒక్కొక్కరు ఒక్కో అనుమానం అడిగితే భవాని చెప్తుంది. ఇక అందరూ పూజలో కూర్చొటారు. 


మురారి, కృష్ణలు పూజ చేస్తారు. అందరూ తలో ఐటెం తీసుకొచ్చి పూజ దగ్గర పెడతారు. సుమతల పళ్లు తీసుకొని వచ్చి కాలు జారి పడిపోతుంది. దాంతో పంతులు అలా పడిపోవడం అపచారం అని చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. వేరే పళ్లను తీసుకురమ్మని చెప్తాడు. మధు పంతులు మీద అసహనం చూపుతాడు. పూజ తర్వాత మురారి, కృష్ణలు ఓ మొక్కకు నీరు పోస్తారు. ఇద్దరూ తమ మనసులో కోరికల్ని కోరుకుంటారు. తర్వాత పంతులు గారు ముకుందతో మీ భర్తని రమ్మని చెప్పండి అంటారు. దాంతో ముకుంద చాలా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.   


Also Read: త్రినయని సీరియల్ జనవరి 15th: ఆస్తి కావాలి అంటే ఇంకో బిడ్డని కనమని సుమనతో చెప్పిన నయని!