Nindu Noorella Saavasam serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో ఏదో ఆలోచనలో ఉంటాడు అమర్. అతని దగ్గరికి వచ్చిన అరుంధతి ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. అతను గదిలోంచి బయటకు వస్తూ ఉంటాడు. అప్పుడే దేవా పంపించిన పాము అమర్ ఇంట్లోకి ప్రవేశిస్తుంది దానిని మిస్సమ్మ చూసి భయంతో గదిలోంచి బయటికి వస్తున్న అమర్ చంక ఎక్కేస్తుంది.


అమర్: ఏం చేస్తున్నావ్ అని కోపంగా అడుగుతాడు.


మిస్సమ్మ: పాము ఇంట్లో దూరింది నన్ను ఎక్కడైనా సేఫ్ ప్లేస్ లో వదిలిపెట్టండి అని భయంతో కళ్ళు మూసుకొని తడబడుతూ మాట్లాడుతుంది.


అమర్: నేనేమైనా షేర్ ఆటో అనుకున్నావా నిన్ను ఎక్కడపడితే అక్కడ దించడానికి నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో చూసుకో అంటాడు.


కళ్ళు విప్పి చూసిన మిస్సమ్మ తాను అమర్ పై ఉన్నానని గ్రహించి గబుక్కున కిందికి దిగుతుంది అమర్ కి క్షమాపణలు చెప్తుంది.


అమర్: పాము ఏది ఎక్కడా కనిపించలేదు అని అడుగుతాడు.


మిస్సమ్మ: ఇక్కడే ఉంటుందేంటి పాము కదా ఎటో వెళ్లి ఉంటుంది అంటుంది.


ఆమె మాటలు పట్టించుకోకుండా కిందికి వస్తాడు అమర్. ఇంతలో ఆ పాము మనోహరి రూమ్లో దూరిపోతుంది. మనోహరి భయంతో కేకలు వేస్తూ బయటకు వస్తుంది. నేను చెప్పాను కదా పాము వచ్చిందని అంటుంది మిస్సమ్మ.


అమర్ : ఇంట్లో వాళ్ళందరినీ బయటికి వెళ్లిపోమంటాడు. రాథోడ్ ని వెనక డోర్ వేసేసి రమ్మంటాడు.


అరుంధతి: కంగారుపడుతూ నేను కూడా వెళ్ళిపోదామంటే అక్కడ మిస్సమ్మ చూస్తుంది ఎలా వెళ్ళటం అనుకుంటుంది.


రాథోడ్ వెనక డోర్ వేసి రావటంతో అమర్ రాథోడ్ ఇద్దరు కూడా ఇంటి బయటకు వచ్చేసి మెయిన్ డోర్ వేసేస్తారు. లోపల ఉండిపోయిన అరుంధతి భయపడిపోతుంది.


అమర్: రాథోడ్ తో ఎవరైనా పాములు పట్టేవాడు ఉంటే తీసుకుని రా అని చెప్పి పంపిస్తాడు.


రాథోడ్ బయటికి వెళ్లి ఇప్పుడు పాములు పట్టేవాడు ఎక్కడ ఉంటాడు అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఘోర పాములు పట్టేవాడు వేషంలో ఇంటి ముందు నుంచి వెళుతూ ఉంటాడు. అతడి వేషధారణ చూసి రాథోడ్ నువ్వు ఏం చేస్తావని అడుగుతాడు.


ఘోర : నేను పక్క ఎగ్జిబిషన్లో పాములు ఆడిస్తూ ఉంటాను అంటాడు.


రాథోడ్: పాములు పట్టుకుంటావా అని అడుగుతాడు.


ఘోర : నేను మా ఊర్లో పాములే పట్టుకునే వాడిని అక్కడ పని లేక ఇక్కడికి వచ్చేసాను అంటాడు.


రాథోడ్ అమర్ దగ్గరికి వచ్చి లక్కీగా పాములు పట్టేవాడు దొరికాడు అని చెప్పడంతో అతనిని రమ్మను అని చెప్పడంతో ఘోర అందరూ చూస్తుండగానే తలుపులు తీసుకొని లోపలికి వెళ్తాడు.


చిత్రగుప్తుడు : ఘోరని గుర్తుపడతాడు, బాలిక లోపల ఉండి పోయినట్లుగా ఉంది అని కంగారు పడతాడు. ఆమెని ఎలా రక్షించాలా అని మదనపడతాడు.


ఘోర : దేవా నువ్వు చెప్పినట్లే ఆ పాము నాకు సాయం చేస్తుంది మరి కాసేపట్లో నేను ఆత్మ ని బంధించబోతున్నాను అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్లి తలుపు వేసేస్తాడు.


అరుంధతి ఘోర ని గుర్తుపట్టి భయంతో వణికి పోతుంది.


ఘోర: నీ కుటుంబమే నీ బలం అనుకున్నావు కదా ఇప్పుడు నీ కోటలోనే నిన్ను బంధించబోతున్నాను అంటాడు.


అరుంధతి వద్దు అని బ్రతిమాలుకుంటుంది అయినా ఆమెపై బూడిద జల్లి వశం చేసుకోవాలనుకుంటాడు ఘోర. ఇంతలో అమర్ తలుపు కొట్టి త్వరగా తలుపు తీయు అంటాడు. ఘోర త్వరగా పని పూర్తి చేద్దాం అనుకుంటాడు కానీ అమర్ తలుపు కొట్టి ఘోరని బయటకి రమ్మంటాడు.


అమర్: బయటికి వచ్చిన ఘోర తో పాము అటువైపు వెళ్ళింది వెళ్లి అక్కడ పట్టుకో అని చెప్తాడు.


చిత్రగుప్తుడు: ఘోర బయటికి రావటం చూసి భగవంతుడా నువ్వున్నావని మళ్ళీ నిరూపించుకున్నావు ఆమె పతి దేవుడే ఆమెను కాపాడుకున్నాడు అతను ఉండగా ఆమెను ఎవరు ఏమి చేయలేరు అనుకుంటాడు.


అంతలోనే పాము ఇంట్లోంచి బయటికి వెళ్లిపోవడం చూస్తాడు రాథోడ్. గార్డెన్లో పాముని వెతుకుతున్న ఘోర దగ్గరికి వచ్చి పాము బయటికి వెళ్లిపోయింది పదా బయట వెతుకుదాం అని అతనిని బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు.


ఘోర : ఐదు నిమిషాలు ఉంటే నా పని అయిపోయేది నేను ఆత్మ దగ్గర మళ్లీ మళ్లీ ఓడిపోతున్నాను అని కోపంతో రగిలిపోతూ రాథోడ్ వెనుక వెళ్ళిపోతాడు. అక్కడితో ఈరోజు కథ ముగుస్తుంది.


Also Read: బిగ్ బాస్‌లో శివ్ చెప్పాలనుకున్న బ్యాడ్ న్యూస్ ఇదేనా? ఇక ప్రియాంకకు దూరంగా ప్రియుడు, కారణం ఇదే