నం నిత్యం ఉపయోగించే వస్తువుల్లో ముఖ్యమైనది టూత్ పేస్ట్. ప్రతి రోజు ఉదయాన్నే బ్రష్ చేసుకునే సమయంలో ప్రతి ఒక్కరు పేస్ట్ వాడుతూ ఉంటారు. ఎవరికి నచ్చిన బ్రాండ్ టూత్ పేస్ట్ వారు వాడుతూ ఉంటారు. ఎవరు ఏ పేస్ట్ వాడినా.. ట్యూబ్ చివరన  ఒక్కోదాని మీద ఒక్కోటి చొప్పున నాలుగు రంగులు కనిపిస్తాయి. అందులో ఒకటి ఎరుపు, మరొకటి నీలం, ఇంకొకటి నలుపు, మిగతాది ఆకుపచ్చ. ఇంతకీ ఈ రంగులు ఎందుకు ఉపయోగిస్తారు? వాటి ద్వారా వినియోగదారులకు తయారీ కంపెనీలు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నాయా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.


టూత్పేస్ట్పై ఉండే రంగులకు అర్థం ఏంటి?  


ఇంటర్నెట్ వినియోగం విరివిగా పెరిగిన నేపథ్యంలో చాలా మంది సమాచారం కోసం గూగుల్ మీదే ఆధారపడుతున్నారు. నెట్ నుంచి వచ్చే డేటాలో అవాస్తవాలు ఉన్నా, వాటినే నిజం అని నమ్ముతున్నారు చాలా మంది. అలాగే టూత్ పేస్ట్ ట్యూబ్ మీద ఉన్న రంగుల విషయంలోనూ చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. టూత్ పేస్ట్ ట్యూబ్ లో ఉపయోగించే పదార్థాలను బేస్ చేసుకుని ఈ రంగుల బ్లాక్ లను ఏర్పాటు చేస్తారని చాలా మంది అనుకుంటారు. ఇంటర్నెట్ లో ఉన్న చాలా వరకు సమాచారం ఇదే విషయాన్ని చెప్తుంది.


టూత్ పేస్ట్ బ్యూబ్ చివరలో ఆకుపచ్చ గుర్తు ఉంటే.. ఈ పేస్ట్ కేవలం సహజ పదార్థాలు మాత్రమే ఉపయోగించి తయారు చేయబడిందని చాలా మంది అనుకుంటారు. నీలం రంగు ఉంటే సహజ పదార్థాలతో పాటు ఔషధ మిశ్రమాన్ని వాడినట్లు భావిస్తారు. ఇక ఎరుపు రంగు ఉంటే సహజ పదార్థాలతో పాటు రసాయన పదార్థాలు కలపడినట్లు భావిస్తారు. ఇక నలుపు రంగు ఉంటే కేవలం రసాయన పదార్థాలు మాత్రమే ఉపయోగించబడినట్లు అని ప్రచారం ఉంది. కానీ, ఇది ముమ్మాటికీ అవాస్తవం అని చెప్తున్నారు నిపుణులు.  టూత్ పేస్ట్ ట్యూబ్ లోని మిశ్రమాల కలయికకు ఈ రంగులకు అసలు సంబంధమే లేదంటున్నారు.   


ఇంతకీ ఈ రంగులు ఏం చెప్తున్నాయంటే?  


ఇదే విషయానికి సంబంధించి తాజాగా కోల్గేట్ కంపెనీ వివరణ ఇచ్చింది. వాస్తవానికి టూత్ పేస్ట్ ట్యూబ్ చాలా పొడవుగా ఉంటుంది. అయితే, తగిన మోతాదులో పేస్ట్ నింపిన తర్వాత ట్యూబ్ చివర కత్తిరించి అతిస్తారు. కచ్చితంగా ఎక్కడి వరకు ఎలా కట్ చేయాలి? అనే విషయాన్ని యంత్రం గుర్తించేలా ట్యూబ్ చివరి భాగంలో ఆయా రంగులతో లైట్ సెన్సార్ ద్వారా సమాచారం అందిస్తారు. అప్పుడు ట్యూబ్ ను కట్ చేసి అతికిస్తుంది. మొత్తానికి టూత్ పేస్ట్ ట్యూబ్ చివరి భాగంలో ఉంటే రంగుల చుక్కలు ఓ రహస్య కోడ్ మాదిరిగా భావించవచ్చు. అయితే, కేవలం ట్యూబ్ కత్తిరింపు కోసమే దీన్ని ఉపయోగిస్తారని కోల్గేట్ కంపెనీ వెల్లడించింది.






Also Read: నడవలేని స్థితిలో మైక్ టైసన్‌, ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!


Also Read: ‘బ్లాక్ కాఫీ’ ప్రేమలో షారుఖ్, రితేష్‌ - దీని ప్రయోజనాలు తెలిస్తే మీరూ లవ్‌లో పడిపోతారు