ఉడకబెట్టిన కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే అందులోని పచ్చ సొన మాత్రం చాలా మంది తినేందుకు ఇష్టం చూపించరు. కారణం అందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని దాని వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉందని అనుకుంటారు. మరి అది ఎంత వరకు నిజం. పచ్చ సొన తింటే నిజంగానే కొవ్వు పేరుకుపోతుందా అంటే కాదని అంటున్నారు పోషకాహార నిపుణులు. నిజానికి గుడ్డులోని తెల్లసొన కంటే పచ్చసొన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మంచి ప్రోటీన్స్ అందిచాడమే కాకుండా గుండెకి అవసరమయ్యే అన్ సాచురేటెడ్ ఫ్యాట్, ఒమేగా 3 ఆమ్లాలు ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో రిబోఫ్లావిన్, విటమిన్ డి మరియు విటమిన్ B-12 వంటి అనేక మంచి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఒక రకంగా చూస్తే తెల్లసొనలో కంటే పచ్చ సొనలోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. అందుకే వర్కవుట్స్ చేసే వాళ్ళు బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు జిమ్ చేసిన తర్వాత పచ్చి కోడిగుడ్డులోని పచ్చసొన తాగేస్తారు. 


పచ్చసొన వల్ల ఉపయోగాలు 


* 100 గ్రాముల పచ్చ సొనలో 16 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. 


* విటమిన్ డి: 54%


* విటమిన్ ఎ: 28% 


* మెదడు పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తుంది. 


* బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. 


* గుండె పని తీరు బాగుండేందుకు దోహదపడుతుంది. 


* కంటి సంబంధ సమస్యలు రాకుండా నివారిస్తుంది.


ఎన్ని తీసుకోవచ్చు 


ఆరోగ్యంగా ఉండటం కోసం రోజుకి రెండు పచ్చసొన గుడ్లు తీసుకోవవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అదే గుండె సంబంధ సమస్యలతో బాధ పడే వాళ్ళు రోజుకి ఒక పచ్చసొన గుడ్డు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: మట్టి కుండలో నీటిని తాగితే ఎసిడిటీ తగ్గుతుందా? దీనిపై ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారంటే


Also read: చారు పొడి కొనుక్కుంటున్నారా? ఇలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు