శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి అవసరం... ఇంతవరకు మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ మీరు ఆనందంగా, ఉల్లాసంగా,  ప్రశాంతంగా ఉండాలన్నా కూడా విటమిన్ డి పుష్కలంగా కావాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా డల్‌గా ఉండడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం, అలసటగా అనిపించడం, చిరాకు, కోపం త్వరగా రావడం జరుగుతోందా? అయితే మీకు విటమిన్ డి లోపం ఉందేమోనని ఓ సారి చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే విటమిన్ తగినంత శరీరానికి అందితే మీరో హ్యాపీ హార్మోన్లు బాగా ఉత్పత్తి అవుతాయి. కోపం తగ్గుతుంది, ఆనందం పెరుగుతుంది.


 ఎంతో అవసరం...
విటమిన్ డి మన శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికీ చాలా అవసరం. విటమిన్ శరీరానికి తగినంత అందితే అది ఆహారంలోని కాల్షియాన్ని శరీరం గ్రహించుకునే చేస్తుంది. దీని వల్ల ఎముకలు గుల్లబారకుండా గట్టిగా ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది ముందుంటుంది. రోజూ కాసేపు ఎండలో నిల్చుంటే కావాల్సినంత విటమిన్ అందుతుంది. 


మానసిక కుంగుబాటు రాకుండా..
మన మెదడు సక్రమంగా పనిచేయాలంటే న్యూరోస్టిరాయిడ్లు అవసరం. వాటిల్లో ఒకటి విటమిన్ డి కూడా. అందుకే విటమిన్ డి తగ్గితే మెదడు కూడా మందకొడిగా పనిచేస్తుంది. మానసిక ఆరోగ్యానికీ డి విటమిన్ చాలా అవసరం. కుంగుబాటు, ఆందోళన, డిప్రెషన్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. ఇవన్నీ వస్తున్నాయి అంటే విటమిన్ డి లోపం ఉందేమో చూసుకోవాలి. విటమిన్ డి పుష్కలంగా అందితే హ్యాపీ హార్మోన్లు అయిన సెరోటోనిన్, డోపమైన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. అప్పుడు శరీరానికి ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. సూర్యరశ్మి తాకేలా రోజుకి పావుగంట నుంచి ఇరవై నిమిషాల పాటూ ఉంటే చాలు, ఈ లోపం తలెత్తదు. అయితే మరీ ఎక్కువ సేపు ఎండకు గురవ్వడం కూడా మంచిది కాదు. 


కీళ్ల నొప్పులు రావడం, పాదాల్లో వాపు, నిల్చుంటే నీరసం రావడం, కండరాలు బలహీనంగా అనిపించడం, త్వరగా అలసిపోవడం... ఇవన్నీ కూడా విటమిన్ డి లోపం అని చెప్పే లక్షణాలే. కొవ్వు పట్టిన చేపలు, గుడ్డులోని పచ్చసొన, చీజ్, ఆరెంజ్, బాదం పప్పుల్లో కాస్త విటమిన్ డి లభిస్తుంది. కానీ సరిపడినంత అందాలంటే మాత్రం సూర్యరశ్మి ఒక్కటే దారి. 


Also read: ఉపవాసం మంచిదే కానీ డయాబెటిస్ రోగులు చేయవచ్చా?


Also read: ఈ బ్లడ్ గ్రూపు వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువట












గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.