మాళవిక తనకి ఎవరు లేరా అని ఏడుస్తూ ఉంటే అప్పుడే ఆదిత్య అక్కడికి వస్తాడు. ఎందుకు మామ ఏడుస్తున్నావ్ అని అడుగుతాడు. నిన్ను చూసిన ఆనందంలో కంట్లో నీళ్ళు వచ్చాయిలే అని అభి చెప్తాడు. ఆ మాటకి ఏదైనా సరే మామ్ కళ్ళలో నీళ్ళు చూడటం నాకు ఇష్టం లేదని ఆదిత్య అంటాడు. మామ నీకు హెల్త్ బాగోలేదని అంకుల్ చెప్పారు ఏమైంది హాస్పిటల్ కి వెళ్దాం రా అని అడుగుతాడు. ఇందాక కొంచెం తలనొప్పిగా అనిపించింది ఇప్పుడు నిన్ను చూడగానే అంతా తగ్గిపోయింది. నువ్వు ఒక్కడివి ఉంటే చాలు నాకు కొండంత ధైర్యం అని మాళవిక సంతోషపడుతుంది. నీ కొడుకు నీకు ధైర్యం అయితే నాకు మాత్రం నీ మొగుడు మీదకి నేను వెయ్యబోయే డైనమేట్ అని అభి మనసులో అనుకుంటాడు. మాళవిక ఏడుస్తూ ఉంటే ఆదిత్య చాలా బాధపడతాడు. నీ మొహం చూడు డల్ గా ఎలా ఉందో నా హెల్త్ గురించే కాదు అప్పుడప్పుడు నీ హెల్త్ గురించి కూడా ఆలోచించాలి కదా మామ్ అని ఫీల్ అవుతాడు. మీ చెల్లి ఖుషిని తీసుకెళ్లినట్టు ఆ యశోధర్ నిన్ను కూడా ఎక్కడ తీసుకెళ్లిపోతాడో అని మీ అమ్మ బాధపడుతుందని అభి చెప్తాడు. రోజు ఇలా ఏడుస్తూ అదే ఆలోచిస్తూ వీక్ గా తయారైందని అంటాడు.


ఏమ్మా నాకు చెప్పకూడదా. చెల్లి అక్కడ ఎందుకు ఉందో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఎక్కడికి వెళ్ళను ఎవరు పిలిచినా వెళ్ళను నీతోనే ఉంటాను అని తల్లిని కౌగలించుకుంటాడు. నేను ప్రయోగించిన ఆయుధం ట్రైలర్ అద్భుతంగా ఉంది ఇక ముందు ముందు సినిమా అదిరిపోతుందని అభి మనసులో అనుకుంటాడు. మరో వైపు యష్ ఆదిత్య కోసం బాధపడుతూ ఉంటాడు. ‘వాడిని చూడాలని వాడితో టైం స్పెండ్ చెయ్యాలని ఎంత బాధపడ్డానో తెలుసా. వాడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియదు. ఇంతకన్నా వేరే నరకం ఉంటుందా? ప్రతి పుట్టినరోజు వాడి కోసం ఎదురు చూడని క్షణం ఉండదు. వాడిని చూస్తాను అని ప్రతి పుట్టినరోజు ఆశపడతాను’ యష్ బాధపడతాడు. నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది, తనని మీరు చూస్తారు, తనతో మీరు మాట్లాడతారు మీ కొడుకు మీతో మాట్లాడతాడు అని వేద యష్ కి ధైర్యం చెప్తుంది.


Also Read: మన పెళ్లి ఎప్పుడని అభిని నిలదీసిన మాళవిక- యష్ మీద పగ తీర్చుకోవడానికి అభికి దొరికిన అస్త్రం


మా చెల్లి మామ్ ఇంట్లో ఉండకుండా ఆ ఇంట్లో ఎందుకు ఉంది నాదగ్గర ఏదైనా సీక్రెట్ దాస్తుందా అని ఆదిత్య అభిని అడుగుతాడు. సీక్రెట్ కాదు ఆది కొన్ని విషయాలు నీకు చెప్పకుండా ఒంటరిగా బాధపడుతుందని చెప్తాడు. మామ్ చెప్పకపోతే మీరైనా చెప్పండి అని ఆదిత్య అభిని అడుగుతాడు. ‘నువ్వు హాస్టల్ కి వెళ్ళిన తర్వాత ఆ యశోధర్ బిహేవియర్ లో చాలా మార్పు వచ్చింది.. మీ అమ్మని టార్చర్ చేశాడు. విడాకులు తీసుకుని ఏవేవో సమస్యలు సృష్టించి కోర్టులు, పోలీసు స్టేషన్లు అంటూ పిచ్చిదానిలా తిప్పించాడు. కానీ ఆ యశోధర్ మాత్రం నీ చెల్లి లైఫ్ గురించి ఆలోచించకుండా ఇంకో పెళ్లి చేసుకున్నాడు’ అని అభిమన్యు చెప్తాడు. మరి చెల్లి అక్కడే ఉందా లేదా నాలాగే హాస్టల్ కి  పంపించేశారా అని అమాయకంగా అడుగుతాడు. తను కూడా ఎక్కడ మాళవిక దగ్గరకి వచ్చేస్తుందో అని ఆ యశోధర్, కొత్త వైఫ్ ఖుషి మీద లేని ప్రేమని నటిస్తున్నారని అంటాడు. కొత్త వైఫ్ తో కలిసి ఆ యశోధర్ మీ చెల్లికి మీ మమ్మీ గురించి బ్యాడ్ గా చెప్పాడు అందుకే ఖుషికి మీ మమ్మీ అంటే ఇష్టం ఉండదు. మాట్లాడమే కాదు చూసే వీలు కూడా లేకుండా చేశాడు ఆ యశోధర్. ఖుషి కోసం మీ మమ్మీ చాలా సార్లు ఆ ఇంటికి కూడా వెళ్ళింది కానీ ఆ యష్ మనసు కరగలేదు. మీ మమ్మీ నిన్ను చూడటానికి అన్నిసార్లు వచ్చింది, మరి ఆ యశోధర్ ఒక్కసారైనా వచ్చాడా? అలాంటి వాడు మీ చెల్లిని దూరం చేసినట్టు నిన్ను కూడా ఎక్కడ తీసుకెళతాడో అని భయపడుతుందని అభి పసి పిల్లాడి మనసులో విషం నింపుతాడు.


‘నేను ఇక్కడే ఉండి మామ్ ని చూసుకుంటాను. మా మామ్ ని ఏడిపిస్తున్న అతను నా డాడీనే కాదు అతను నాకొద్దు, నేను ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళను మాట్లాడను ఈ హేట్ హిమ్’ అని ఆదిత్య కోపంగా చెప్తాడు. మాళవిక ఆదిత్యకి గోరుముద్దలు పెడుతూ మురిసిపోతుంది. చెల్లిని చూడాలని అనిపిస్తుందని అంటాడు ఆది. మన ఇంట్లో నీ బర్త్ డే పార్టీ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేద్దాం అని అభి అంటాడు. యశోధర్ కి ఫోన్ చేసి పార్టీ కి రమ్మని పిలువమని అభి అదిత్యకి చెప్తాడు. అతనితో నేను మాట్లాడను నాకు ఇష్టం లేదని ఆది అంటే ఖుషిని చూడాలని ఉంది కదా తన కోసం కాల్ చేసి మాట్లాడి రమ్మని పిలువమని మాళవిక కూడా చెప్తుంది. దీంతో ఆదిత్య సరే అని యశోధర్ కి కాల్ చేస్తాడు.


Also Read: నువ్వెవరో తెలియదన్న కార్తీక్, ఇన్విస్టిగేషన్ ప్రారంభించిన దీప, మోనిత ఎంట్రీకి టైమ్ వచ్చేసింది


యష్ బాధగా కూర్చుని ఉంటే ఆదిత్య ఫోన్ చేస్తాడు. ఎవరు అని యష్ అంటే నేను ఆదిత్యని మాట్లాడుతున్నా.. మాళవిక గారి అబ్బాయిని అని చెప్తాడు. యష్ సంతోషంగా నాన్న నువ్వా నిజంగా నువ్వు నాకు కాల్ చేశావా డాడీకి కాల్ చేశావా ఎక్కడున్నావ్ రా ఎలా ఉన్నావ్ రా అని ఆత్రంగా అడుగుతాడు. నేను మా ఇంట్లో హ్యాపీగా ఉన్నానని చెప్తాడు. నీ బర్త్ డేకి విష్ చెయ్యాలని ప్రతిసారీ అనుకుంటాను కానీ ఈ సారి లక్కీగా నువ్వే కాల్ చేశావ్ అని యష్ అనేసరికి నా బర్త్ డే మీకు ఇంక గుర్తుందా మీ లైఫ్ లోకి కొత్తపర్సన్ వచ్చింది కదా మర్చిపోతారని అనుకున్నాను అని ఆదిత్య కోపంగా అంటుంటే యష్ మాత్రం సంతోషంతో ఉబ్బితబ్బిబవుతాడు. నీ బర్త్ డే కలలో కూడా మర్చిపోను అని చెప్తాడు. అంతా మిస్ అవుతున్నవాడివి నన్ను చూడటానికి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియకుండా చేశారని యష్ చెప్తాడు. ఈవినింగ్ బర్త్ డే పార్టీ ఉంది రమ్మని చెప్పడానికే ఫోన్ చేశాను మీతో పాటు నానమ్మ, తాతయ్య మరి ముఖ్యంగా నా చెల్లి ఖుషిని తీసుకునిరండి అని చెప్తాడు. అందరం వస్తాం అని చెప్తాడు. ఒక్కసారి నన్ను నాన్న అని పిలవ్వా అని యష్ ప్రేమగా అడుగుతాడు, కానీ ఆదిత్య మాత్రం కోపంగా ఫోన్ కట్ చేసేస్తాడు.