Morning Habits That Power Your Entire Day : మన ఉదయం ఎలా ప్రారంభమవుతుందో.. చాలా వరకు మన రోజు కూడా అలానే వెళ్తుంది. కానీ చాలామంది ఉదయం నిద్ర లేవడానికి ఇబ్బంది పడతారు. తప్పక లేచినా అలసటగా, నీరసంగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు కూడా మీ మార్నింగ్స్​ వల్ల డే డిస్టర్బ్ అయినట్లు ఫీల్ అవుతున్నారా ? అయితే ఈ అలవాట్లు లైఫ్​స్టైల్లో చేర్చుకోండి. రోజంతా మీ శరీరం ఎనర్జీతో నిండిపోతుంది. శారీరకంగా యాక్టివ్​గా, మానసికంగా కూడా ఫ్రెష్‌గా మారిపోవచ్చు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటంటే..

Continues below advertisement

త్వరగా నిద్ర లేవడం

నిజానికి ఆలస్యంగా లేస్తే నిద్ర సరిపోతుంది. దాంతో యాక్టివ్​గా ఉంటామనుకుంటారు కానీ.. లేట్​గా లేవడం వల్ల బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. పైగా ఆలస్యంగా లేవడం వల్ల రోజు మొత్తం మీకు గ్యాప్​ లేనంత బిజీగా మారిపోతుంది. కాబట్టి ఉదయం త్వరగా లేస్తే శరీరానికి, మెదడుకు ప్రశాంతమైన స్టార్ట్ లభిస్తుంది. దీనివల్ల మీకు రోజంతా మంచి ఎనర్జీ అందుతుంది.

నీరు తాగడం

రాత్రంతా శరీరం నీరు లేక డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి.. ఉదయం నిద్ర లేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగితే శరీరం మళ్లీ యాక్టివ్ అవుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఫ్రీ మోషన్​కి హెల్ప్ చేస్తుంది. 

Continues below advertisement

మొబైల్ చూడకండి..

చాలామంది ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూస్తారు. ఇది అస్సలు మంచి అలవాటు కాదు. ఉదయాన్నే బెడ్​పై ఉండి మొబైల్ చూస్తే.. మెదడుపై ఒత్తిడి పెరిగి ఆందోళన ఎక్కువవుతుంది. నిద్ర లేచాక కనీసం 30 నిమిషాలు మొబైల్‌కు దూరంగా ఉండటం మంచిది.

తేలికపాటి వ్యాయామం 

ఉదయాన్నే వాకింగ్, యోగా, స్ట్రెచింగ్ లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరానికి సహజంగా ఎనర్జీ లభిస్తుంది.

ఎండలోకి వెళ్లండి..

మధ్యాహ్నం ఎండలోకి వెళ్లడం ఇబ్బందే కానీ.. ఉదయపు సూర్యకాంతి శరీరానికి విటమిన్ D అందిస్తుంది. అలాగే బ్రెయిన్​ఫాగ్​ని దూరం చేసి.. మూడ్ మెరుగుపడటానికి, అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఉదయాన్నే ఓ పది నిమిషాలు ఎండలో ఉండండి.

టిఫెన్​లో ఇవి ఉండాలి..

ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్​ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. గుడ్లు, నట్స్, పప్పులు, పెరుగు వంటి ప్రోటీన్ ఫుడ్స్ శరీరానికి ఎక్కువసేపు శక్తిని అందిస్తాయి. కొందరు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తారు. అది అస్సలు మంచిది కాదని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. 

డీప్ బ్రీతింగ్ 

మీరు వ్యాయామం చేయలేరు.. టైమ్ కుదరదు అనుకుంటే కనీసం మీ బెడ్ మీద కూర్చొని కొన్ని నిమిషాలు ధ్యానం లేదా డీప్ బ్రీతింగ్ తీసుకోండి. దీనివల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి రోజంతా ఫోకస్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

డే ప్లాన్ 

ఉదయాన్నే ఈ రోజు చేయాల్సిన పనులను ఏంటి అని ప్లాన్ చేసుకోండి. సగం కన్​ఫ్యూజన్ తగ్గుతుంది. ఏ పని ముందు చేయాలో క్లారిటీ ఉంటుంది. అలాగే ఏ పని కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఓ రకంగా ఒత్తిడి తగ్గుతుంది. 

టీ, కాఫీ

ఉదయాన్నే టీ లేదా కాఫీ పడకపోతే బ్రెయిన్ పని చేయదు అనుకునేవారు వాటి మోతాదును తగ్గించాలి. ముఖ్యంగా షుగర్ తక్కువ వేసుకోవాలి. అలాగే ఎనర్జీ డ్రింక్స్​కి దూరంగా ఉండాలి. ఎందుకంటే.. మీరు అవి తాగినప్పుడు యాక్టివ్​గా ఉన్నా.. అలసట మాత్రం త్వరగా పెరుగుతుంది. 

పాజిటివ్‌గా ప్రారంభించండి..

ఉదయాన్నే మంచి ఆలోచనలతో రోజు ప్రారంభిస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. జరిగే విషయాలు ఎలాగో జరుగుతాయి. కాబట్టి నెగిటివ్ అంశాల గురించి ఆలోచించకండి. మీకు ఏది పాజిటివ్ ఫీల్ ఇస్తుందో.. దానితోనే ఉదయాన్ని ప్రారంభిస్తే మంచిది. 

ఇవన్నీ చిన్న అంశాలే అయినా.. రోజంతా మీరు యాక్టివ్​గా, పాజిటివ్​గా ఉండడంలో మంచి మార్పులు తీసుకువస్తాయి. అలాగే వీటితో శరీరం, మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది. కాబట్టి ఈ చిన్ని అలవాట్లను అస్సలు విస్మరించకండి. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టైల్ వార్తల కోసం దీనిని క్లిక్ చేయండి.