నిషిని మనిషి చంపడం ఘోరమైన నేరం. అంతటితో ఆగకుండా వారిని తినేయడం మరింత దారుణం. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని మనుషులు అనడం కంటే.. రాక్షసులు అనడమే ఉత్తమం. రష్యాలో రక్తం రుచి మరిగిన వ్లాదిమిర్ కూడా అదే చేశాడు. తాగిన మత్తులో వ్యక్తిని దారుణంగా హత్య చేయడమే కాకుండా అతడిని ముక్కలు చేసుకుని తినేశాడు. ఆ తర్వాత ఆ మాంసాన్ని తన కుటుంబానికి కూడా తినిపించాడు. మిగిలిన మాంసాన్ని మార్కెట్లో అమ్మేశాడు. మరి, అతడు చేసిన ఘోరం ఎలా బయటపడింది? అసలు ఆ వ్యక్తిని వ్లాదిమర్ ఎందుకు చంపాడు? ఆ శవాన్ని తినాలనే కోరిక ఎందుకు పుట్టింది? 


వ్లాదిమిర్ అంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కాదు. ఈ నరభక్షుకుడి పూర్తి పేరు వ్లాదిమిర్ నికోలాయెవిచ్ నికోలాయేవ్. ప్రస్తుతం వ్లాదిమిర్‌కు 63 ఏళ్లు. 1997లో ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు. కోర్టు అతడికి మరణ శిక్ష కూడా విధించింది. అయితే, 1999లో రష్యా అతడి మరణశిక్షను రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చింది. 2001లో వ్లాదిమర్‌ను కజఖాస్థాన్ సరిహద్దు సమీపంలోని K-6 బ్లాక్ డాల్ఫిన్ జైలుకు బదిలీ చేశారు. ఈ జైల్లో పగలంతా పనిచేస్తూనే ఉండాలి. విశ్రాంతి తీసుకోకూడదు. సెల్‌లో సేద తీరకూడదు. అందుకే, ఈ జైల్‌ను రష్యాలో భూలోక నరకం అంటారు. అయితే, వ్లాదిమర్ వంటి నరమాంస భక్షకుడికి ఆ శిక్ష కూడా తక్కువే. 


ఇటీవల నేషనల్ జియోగ్రఫీ చానల్ ‘ఇన్‌సైడ్ రష్యాస్ టఫెస్ట్ ప్రిజన్’ అనే డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఇందులో ఆ జైల్లోని పరిస్థితులను వివరించింది. ఈ సందర్భంగా ఆ చానల్ అక్కడ శిక్షను అనుభవిస్తు్న్న వ్లాదిమిర్‌ ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తాను చేసిన భయానక నేరం గురించి చెప్పాడు. తనని అంతా ‘Vladimir The Cannibal’ అని అంటారని చెప్పగానే.. అంతా షాకయ్యారు. ఎందుకంటే.. ఆ ఘటనను దాదాపు అంతా మరిచిపోయారు. అతడు ఎలా ఉంటాడనేది కూడా చాలామంది సరిగ్గా చూడలేదు. కానీ, ఈ కార్యక్రమం వల్ల నాటి నరరూప రాక్షసుడు ప్రేక్షకులకు మొదటిసారి కనిపించాడు. అతడు కూడా తాను మొదటిసారి మనిషి మాంసాన్ని తిన్న అనూభూతిని ఎలాంటి పశ్చాతాపం లేకుండా వివరించాడు.


తాగిన మత్తులో గొడవ.. ఆపై హత్య: ‘‘నేను పార్టీలో కొంచెం తాగి ఇంటికి తిరిగి వెళ్తున్నాను. నా బిల్డింగ్ తలుపు పక్కన ఉన్న మరొక వ్యక్తి కూడా తాగి, నన్ను లైటర్ అడిగాడు. ఈ సందర్భంగా మా మధ్య వాదన మొదలైంది. ఇద్దరం బాగా గొడవ పడ్డాం. అతను నన్ను కొట్టాడు, అతన్ని కొట్టాను. నా దెబ్బకు అతను చనిపోయాడు. దీంతో నాకు ఏం చేయాలో తోచలేదు. అతడిని హత్య చేయాలనే ఉద్దేశం నాకు లేదు. అలాగే అతడిని తినాలనే కోరిక కూడా లేదు’’ అని వ్లాదిమిర్ తెలిపాడు. 


తినాలని అనుకోలేదు, కానీ..: ‘‘అతడిని తినాలనే ఉద్దేశం నాకు లేదు. అతడి శవాన్ని మాయం చేయడం కోసం ముక్కలుగా నరికేసి పడేయాలని భావించాను. వెంటనే ఆ శవాన్ని బాత్రూమ్‌లోకి లాక్కొని వెళ్లాను. శవానికి ఉన్న బట్టలు విప్పేసి కత్తిరించడం మొదలుపెట్టాను. అలా కట్ చేస్తున్నప్పుడే నాకు అతడి మాంసాన్ని తినాలనే కోరిక పుట్టింది. నేను అతని తొడ నుంచి మాంసం ముక్కను కత్తిరించి ఉడకబెట్టాను. కానీ, అది అంత రుచిగా లేదు. దీంతో దాన్ని పాన్లో వేసి బాగా ఫ్రై చేసుకుని తిన్నాను’’ అని తెలిపాడు.


Also Read: చేతిలో చిప్.. ఇక మీ చెయ్యే ఏటీఎం కార్డు, చర్మంలోనే అమర్చేస్తారట!


కుటుంబానికీ తినిపించాడు: వ్లాదిమర్ ఆ మాంసాన్ని తన భార్య, పిల్లలకు కూడా తినిపించాడు. అయితే, అది మనిషి మాంసం అని వారికి తెలీదు. మాంసం కాస్త భిన్నంగా ఉండటంతో అతడి భార్య అనుమానించింది. దీంతో అతడు అది కంగారు మాంసమని చెప్పాడు. ఆమె ఆ మాంసంతో మీట్ బాల్స్ చేసి పిల్లలకు పెట్టింది. ఆ తర్వాత ఆమె కూడా కొన్నింటిని ఆరగించింది. ఆ తర్వాత అతడు ఆ శవంలోని కొన్ని శరీర భాగాలను కట్ చేసి మార్కెట్లో విక్రయించడానికి వెళ్లాడు. 


Also Read: ప్రియురాలి చనుబాలు, పచ్చిమాంసం - ఇవే ఇతడి హెల్త్ సీక్రెట్


మార్కెట్లో మానవ మాంసం: మిగిలిన మానవ మాంసాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లి విక్రయించడం మొదలుపెట్టాడు వ్లాదిమిర్. సుమారు 5 కిలోలకు పైగా మాంసాన్ని ఎవరికీ సందేహం కలగకుండా అమ్మేశాడు. మార్కెట్లో కూడా దాన్ని కంగారు మాంసం అని చెప్పాడు. దాని రుచి అసాధారణంగా ఉండటంతో ఓ మహిళకు అనుమానం కలిగింది. తన వద్ద కొన్ని మాంసం ముక్కలను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి పరీక్ష చేయించింది. అది మనిషి రక్తమని తేలింది. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. అలా వ్లాదిమర్ పట్టుబడ్డాడు. అయితే, వ్లాదిమర్ చంపిన మరో వ్యక్తి ఎవరనేది మాత్రం తెలియరాలేదు. దాని గురించి డాక్యుమెంటరీలో ప్రస్తావన రాలేదు. చూశారుగా, మన చుట్టూ ఇలాంటి రాక్షసులు కూడా ఉంటారు. కాబట్టి, జాగ్రత్తగా ఉండండి. 


ఇతడే ఆ దుర్మార్గుడు: