మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో 'ఆచార్య' అనే సినిమాను తెరకెక్కించారు కొరటాల శివ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. దీంతో వారంతా తమకు న్యాయం చేయాలని కొరటాల ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. 'ఆచార్య' సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు మార్కెట్ వ్యవహారాలు కూడా కొరటాల శివనే చూసుకున్నారు. 
 
దీంతో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు తమకొచ్చిన నష్టాలను కవర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొరటాల కూడా ఈ ఇష్యూని త్వరగా సెటిల్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. నిన్నంతా ట్విట్టర్ లో #JusticeForKoratalaShiva అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. కొరటాల అభిమానులంతా ఈ విషయంలో చిరంజీవి ఇన్వాల్వ్ అవ్వాలని డిమాండ్ చేశారు. 


అయితే మెగాఫ్యాన్స్ మాత్రం చిరంజీవి తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. కథ, కథనాల్లో సత్తా లేనప్పుడు హీరోలు ఎంత కష్టపడినా వర్కవుట్ అవ్వదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మెగా క్యాంప్ నుంచి ఓ న్యూస్ బయటకొచ్చింది. 'ఆచార్య' నష్టాలను భర్తీ చేయడానికి చిరంజీవి, రామ్ చరణ్ కలిసి రూ.20 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గా బయటకు చెప్పే ఛాన్స్ లేదు. దీంతో ఇందులో ఎంతవరకు నిజముందనే సందేహాలు కలుగుతున్నాయి. 


సినిమాలకు నష్టాలు వచ్చినప్పుడు హీరోలు తమ రెమ్యునరేషన్ లో కొంత అమౌంట్ ని తిరిగిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చిరు, చరణ్ కూడా అలానే చేశారని అంటున్నారు. 'ఆచార్య' సెటిల్మెంట్స్ కి సంబంధించిన తమ నుంచి చేయాల్సిన న్యాయం మెగాహీరోలు చేసినట్లు టాక్. ఇప్పటికైనా ఈ ఇష్యూ సెటిల్ అవుతుందేమో చూడాలి!