ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి మంచి రేటింగ్స్ వస్తున్నాయి. 'జబర్దస్త్'లో కనిపించే కమెడియన్స్ తో పాటు కొందరు టీవీ ఆర్టిస్ట్ లు, యాంకర్స్ ఈ షోలో కనిపిస్తుంటారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ఫన్ తో పాటు ఎమోషన్ కూడా ఉంది. ముందుగా ఈ షోకి జడ్జిగా ఒకప్పటి నటి సంఘవి రావడంతో ఆమెకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 


ఆమెతో ఫన్ చేయాలనుకున్న హైపర్ ఆదికి కౌంటర్ ఇచ్చింది సంఘవి. ఆ తరువాత షోలో కంటెస్టెంట్స్ 'దేవుడు కరుణిస్తాడని' అనే సాంగ్ కి రొమాంటిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అది చూసిన యాంకర్ రష్మీ.. ఇదే సాంగ్ కి శ్రీదేవి జోడీస్ పెర్ఫార్మ్ చేస్తారని చెబుతుంది. వారంతా కూడా రొమాన్స్ కాకుండా ఫన్నీగా పెర్ఫార్మ్ చేసి నవ్వించారు. అనంతరం 'దేవత' సీరియల్ నటీనటులు చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ హైలైట్ గా నిలిచింది. 


ఇక బులెట్ భాస్కర్ తన తండ్రిని తీసుకొచ్చి తమ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత 'జబర్దస్త్'లో కమెడియన్స్ గా ఫేమ్ తెచ్చుకున్న ప్రవీణ్.. లేడీ కమెడియన్ ఫైమాకి స్టేజ్ పైనే 'ఐలవ్యూ' అంటూ ప్రపోజ్ చేశాడు. ఆమె కోసం ఒక రింగ్ కూడా తీసుకొచ్చాడు. ఆమె ఓకే చెప్పడంతో వేలికి రింగ్ తొడిగేశాడు. ఆమెని ఎందుకు ప్రేమిస్తున్నాడో వివరించినప్పుడు ఫైమా ఎమోషనల్ అయింది. ఆమెకి కన్నీళ్లు ఆగలేదు. మరి వీరిద్దరూ నిజంగానే ప్రేమికుల్లో లేక స్కిట్ లో భాగంగా యాక్ట్ చేస్తున్నారో తెలియాల్సివుంది. 


ఫైమా, ప్రవీణ్ లవ్ సీన్ తరువాత హైపర్ ఆది.. రష్మీని స్టేజ్ పైకి పిలిచి.. 'ఇవన్నీ చూశాక నువ్వేమైనా మిస్ అవుతున్నావా..?' అని ప్రశ్నించాడు. అతడు పరోక్షంగా సుధీర్ గురించి అడిగాడు. దానికి ఆమె 'మనసులకి దూరానికి ఏం సంబంధం ఉండదు.. అవి ఎక్కడున్నా కలిసే ఉంటాయి' అని బదులిచ్చింది.