అసలే కరోనా మహమ్మారి పూర్తిగా సమసిపోలేదు. కొత్త రూపాలు, లక్షణాలు సంతరించుకుంటూ దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు శీతాకాలం వచ్చేస్తోంది. దానితో పాటు అనేక అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. జ్వరం, జలుబు లక్షణాలు కూడా కొద్దిగా కోవిడ్ ని పోలి ఉండటం వల్ల ఏ వ్యాధి వచ్చింది అనేది తెలుసుకోవడానికి తప్పనిసరిగా రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఇటువంటి సమయంలో శరీరంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం. అది బలహీనంగా ఉంటే రోగాలు దాడి చేసి మనల్ని మరింత బలహీనంగా మార్చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరగాలంటే తప్పనిసరిగా శరీరానికి విటమిన్ సి అందాలి. అందుకోసం విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి.


రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే ఉత్తమమైన ఆహారాలు, పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఫిట్ నెస్ గా కూడా ఉంటారు. మన ఆరోగ్యానికి విటమిన్ సి తగిన మోతాదులో అందడం చాలా ముఖ్యం. ఎముకల అభివృద్ధికి, గాయాలు త్వరగా నయం అయ్యేందుకు, ఇన్ఫెక్షన్స్ తో పోరాడేందుకు విటమిన్ సి అవసరమైన పోషకం. ఆహారం ద్వారా దాన్ని పొందాలి. ఈ ఆహారాల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అందుకే మీ డైట్లో వీటిని చేర్చుకోవడం వల్ల వ్యాధులని ఎదుర్కోగలిగే శక్తిని అందిస్తాయి.


నారింజ


నారింజలు విటమిన్ సి లభించే అత్యంత గొప్ప వనరుల్లో ఒకటి. 100 గ్రాముల నారింజలో 53.2 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. ఇది కణాలని దెబ్బతినకుండా కాపాడుతుంది. కొల్లాజెన్ ని పెంచి చర్మం మెరుగ్గా ఉండేలా చేస్తుంది. శరీరానికి రక్షణగా నిలిచే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


బ్రకోలి


100 గ్రాముల బ్రకోలిలో 89.2 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్, ప్రోటీన్స్, పొటాషియం వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా అందుతాయి. వీటిని మీ డైట్లో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ సి లభిస్తుంది.


బెల్ పెప్పర్స్


రంగురంగుల్లో దొరికే బెల్ పెప్పర్స్ లో నారింజ కంటే అత్యధికంగా విటమిన్ సి లభిస్తుంది. కొన్ని నివేదిక ప్రకారం బెల్ పెప్పర్స్ తీసుకోవడం వల్ల 169 శాతం వరకి రికమండేడ్ దీయటరీ ఇంటెక్ పొందినట్లుగా పేర్కొన్నాయి. ఆకుపచ్చని బెల్ పెప్పర్స్ లో ఎక్కువగా తీసుకోవచ్చు. వీటినే క్యాప్సికమ్ అని కూడా అంటారు.


కాలే


ఆకుపచ్చని ఆకుకూర కాలే ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు చేస్తుంది. ఇతర కూరగాయల కంటే కాలేలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ పొందడానికి అత్యుత్తమ వనరుల్లో ఇదొకటి. 100గ్రాముల కాలేలో 120 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. దీనితో పాటు విటమిన్ ఏ, కె, ఫోలేట్ కూడా ఉన్నాయి.


స్ట్రాబెర్రీస్


రుచికరమైన ఈ పండ్లలో విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవఈ క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య పరస్తితుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.  ఒక కప్పు స్ట్రాబెర్రీలో దాదాపు 90 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. మెగ్నీషియం, ఫాస్పరస్ కి గొప్ప మూలం ఇది.


టమోటా


టమోటాలో అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనితో పాటు పొటాషియం, విటమిన్లు బి, ఇ తో పాటు ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. టమోటాలు పచ్చిగా కూడా తినొచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: లోటస్ రూట్స్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?