Festival Rangoli Ideas : పండుగల సమయంలో వేసే ముగ్గులకు ప్రత్యేకమైన వైబ్ ఉంటుంది. ఇంటిని అలంకరించినా లేకున్నా.. వాకిట్లో లేదా.. ఇంట్లో ఓ చిన్న ముగ్గు వేసి.. దానిలో ఓ దీపం పెడితే పండగ కళ ఇట్టే వచ్చేస్తుంది. వినాయక చవితి(Vinayaka Chavithi 2024) సమయంలో కూడా అలాంటి ముగ్గులు వేస్తే చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా పువ్వులు, వివిధ కలర్స్​తో బ్యూటీఫుల్ రంగోలి వేయొచ్చు. 


మీకు ముగ్గు వేయడం రాదు అనుకుంటే బొమ్మల తరహాలో వినాయకుడిని గీసి.. వాటిని కలర్స్​తో నింపి బ్యూటీఫుల్​గా మార్చవచ్చు.  అయితే అలాగే బ్యూటీఫుల్ క్యూట్, క్యూట్ వినాయకుడిని వేసి.. పిల్లలతో కలర్స్ నింపించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ పని డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. వారికి కూడా ఓ యాక్టివిటి ఇచ్చినట్టు ఉంటుంది. అయితే మీరు వారికి ఎలాంటి కలర్స్ వేస్తే బాగుంటుందో చెప్పవచ్చు. 




వినాయకుడిని పెట్టి చుట్టూ రంగులు పెట్టొచ్చు. లేదంటే.. పెద్దని డిజైన్ వేసి.. మధ్యంలో వినాయకుడిని కూర్చోబెడితే అందంగా ఉంటుంది. మల్టీపుల్ కలర్స్ తీసుకుని.. ఉప్పును కలిపి.. ఇలా ముగ్గు తరహాలో వేసుకుంటే చూసేందుకు చాలా బాగుంటుంది. రంగులు గాలి వేస్తే ఎగిరిపోతుంది కదా.. దీనితో ఆ సమస్య ఉండదు. మీ ముగ్గు ఎక్కువ సేపు ఉంటుంది. 




కేవలం పూలతో కూడా డిజైన్లు వేసుకోవచ్చు. ఏ పండుగకైనా కేవలం పూలను ఉపయోగించి ముగ్గులు వేయడం వల్ల ఆ ఫెస్టివల్ లుక్ రెట్టింపు అవుతుంది. ఈ వినాయక చవితికి కూడా పూలతో డిజైన్స్ వేసి దీపాలు పెట్టేయండి. 



అసలైన ముగ్గు.. అంటే బియ్యం పిండితో వేసేది. ఇది పూర్వాకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఎందుకంటే ముగ్గు రూపంలో బియ్యం పిండిని  నేలపై వేయడం వల్ల పలురకాల పక్షులకు ఆహారం అందుతుంది. చీమలకు తిండి దొరుకుతుందనే ఉద్దేశంతో ముగ్గును వేసేవారు. కాబట్టి ఈ వినాయక చవితికి నేలపై వినాయకుడి ప్రతిమను ముగ్గుతో వేసి సింపుల్​గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. 




లేదంటే ముగ్గువేసి దాని చుట్టూ పువ్వులు పెట్టి అలకంరించవచ్చు. ఇలాంటి ముగ్గులు కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అపార్ట్​మెంట్​లలో ఉండేవారికి ఇది మంచి లుక్​ని ఇస్తుంది. 




Also Read : వినాయక చవితి శుభాకాంక్షలు 2024.. వాట్సాప్, ఇన్​స్టా, ఫేస్​బుక్​ల్లో ఈ కోట్స్​తో విషెష్ చెప్పేయండి