Ganesh Chaturthi Messages for Friends and Family : వినాయక చవితి(Vinayaka Chavithi 2024) సమయంలో కొన్నిసార్లు ఫ్యామిలీతో ఉండలేకపోవచ్చు. అలాగే ఫ్రెండ్స్​కి దూరంగా ఉండొచ్చు. బంధువుల్ని కలవలేకపోవచ్చు. ఎవరికి ఎంత దూరంగా ఉన్నా.. వారికి సోషల్ మీడియా ద్వారా మెసేజ్ పెట్టొచ్చు. కొన్ని కోట్స్​ని సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు. లేదంటే స్టేటస్ పెట్టి అందరికీ విష్ చేయొచ్చు. ఈ వినాయక చవితికి ఎలాంటి కోట్స్​తో విష్ చేయొచ్చో.. వాట్సాప్, ఫేస్ బుక్​, ఇన్​స్టా వంటి సోషల్​ మీడియా ఖాతాల్లో ఎలాంటి కోట్స్ అప్​లోడ్ చేసి చవితి శుభాకాంక్షలు చెప్పొచ్చో చూసేద్దాం. 


గణేష్ చతుర్థి విషెష్, కోట్స్



  • ఈ వినాయక చవితికి.. ఆ విగ్నేషుడు.. మీకున్న విఘ్నాలు అన్ని దూరం చేయాలని కోరుకుంటూ.. హ్యాపీ వినాయక చవితి 2024.

  • మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. గణేశుడు మీకు శ్రేయస్సు, జ్ఞానం, సంతోషం, ధనాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.

  • మా ఫ్యామిలీ తరపున మీకు, మీ ఫ్యామిలీకి హ్యాపీ వినాయక చవితి. ఈ వినాయకచవితి మీకు సుందరమైన, గొప్పదైన, శాంతియుతమైన లైఫ్​ని ఇవ్వాలని విష్ చేస్తున్నాను.

  • ఈ వినాయక చవితి మీకు ఎంతో ఆనందాన్ని అందించి.. సంతోషకరమైన జ్ఞాపకాలను మీ సొంతం చేయాలని కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి.

  • ఆ గణేషుడు మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును మీకు అధిగమించే శక్తి, ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు. గణపతి బప్పా మోరియా. ఈ వినాయక చవితిని ఉత్సాహంగా, ఆనందంతో, ఫ్యామిలీతో కలిసి కలర్​ఫుల్​గా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. వినాయక చవితి 2024 శుభాకాంక్షలు. 

  • ఈ పవిత్రమైన రోజు మీకు, మీ కుటుంబానికి ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వినాయక చవితి.

  • గణేశుడు మీ జీవితంలో, ఆరోగ్యంలో ఉన్న సమస్యలను, అడ్డంకులను తొలగించి.. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి.

  • మీ కుటుంబ సభ్యులకు, మీకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ఏడాది మీరు అనుకుంటున్న.. కోరుకుంటున్న గోల్​ని కచ్చితంగా రీచ్​ అవుతారు.

  • ఆటంకాలను తొలగించే గణనాథుడు.. ప్రస్తుతమ మీరు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా త్వరలోనే దూరం చేసేస్తాడు. భక్తితో మీరు కూడా గణపతికి పూజ చేయండి. హ్యాపీ వినాయక చవితి.

  • మీరు ఇంటికి తెచ్చుకునే వినాయకుడు.. మీ జీవితంలో సానుకూల శక్తిని, ఆర్థిక శ్రేయస్సును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ వినాయక చవితి.




  • ఎప్పటినుంచో ప్రారంభించాలనుకుంటున్న మీ వ్యాపారం.. ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్లేందుకు రేపటి నుంచే దాని పనులు చేసేయండి. హ్యాపి వినాయక చవితి. 

  • ఈ గణేశ్ ఉత్సవాలు మీకు అదృష్టాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ వినాయక చవితి.

  • వినాయకుడు మీ ఇంట్లో, మీలో ప్రేమ, సానుకూల వాతావరణాన్ని నింపాలని కోరుకుంటూ.. వినాయక చవితి శుభాకాంక్షలు.

  • మీరు సాధించాలనుకుంటున్న పోరాటాలన్నింటిలోనూ వినాయకుడు మీకు తోడుగా ఉంటాడు. గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు.

  • ఆ వినాయకుడు మిమ్మల్ని మీ కుటుంబ సబ్యులను ప్రేమతో, నవ్వులతో, సంతోషంతో చల్లగా చూడాలని విష్ చేస్తూ.. హ్యాపీ వినాయక చవితి. 


Also Read : వినాయకచవితికి ఈ డ్రెస్​లు బెస్ట్ ఆప్షన్.. అమ్మాయిలు మీరు ఇలా ముస్తాబైపోండి..