Today Top Headlines:
1. వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
విజయవాడలోని (Vijayawada) వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) శుక్రవారం ఏరియల్ సర్వే (Aerial Survey) చేశారు. వరదలకు మూల కారణమైన బుడమేరు (Budameru) డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వరద ప్రవాహం, ముంపు, గండ్లు పడిన ప్రాంతాలను సర్వే చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. అంతకుముందు నగరంలో కొనసాగుతోన్న వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంకా చదవండి.
2. మాజీ సీఎం జగన్ లండన్ టూర్ వాయిదా
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడో తేదీన కుటుంబసమేతంగా లండన్ వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన ఇంకా వెళ్లలేదు. ఏడో తేదీన వెళ్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి . కానీ ఆ రోజున కూడా వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంంది. దీనికి కారణం పాస్ పోర్టు ఇంకా చేతిలోకి రాకపోవడమే. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ఆయన పాస్ పోర్టును కోర్టులో సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు తీసుకుని మళ్లీ సమయం ముగిశాక కోర్టులోనే సబ్మిట్ చేయాలి. ఇంకా చదవండి.
3. విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు
భారీ వర్షాలు, వరదల నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. దెబ్బతిన్న రవాణా వ్యవస్థ కూడా సర్దుకుంటోంది. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లపై వరద నీరు చేరడంతో... చాలా వరకు రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేశారు. అయితే.. వరద తగ్గడంతో.. యుద్ధ ప్రాతిపదిక మరమ్మతులు చేసి... రైళ్ల రాకపోకలను పునరుద్దరిస్తున్నారు అధికారులు. రాయనపాడు మార్గంలో ట్రాక్ నీట మునిగడంతో... ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపేశారు. అయితే... ప్రస్తుతం అక్కడ వరద నీరు తగ్గడంతో.. మరమ్మతులు చేపట్టి... రైళ్ల రాకపోకలను పునరుద్దరించారు. ఇంకా చదవండి.
4. రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్
యాక్టర్ రాజ్‌తరుణ్, లావణ్య కేసులో హైదరాబాద్ పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. లావణ్య చెబుతున్నట్టు కొన్ని విషయాలు నిజమేనంటూ కోర్టులో ఛార్జ్‌షీట్ వేశారు. ఇద్దరూ పదేళ్ల పాటు సహజీవనం చేశారని వివరించారు. ఒకే ఇంట్లో ఉన్నారని కూడా తేల్చారు. ఈ కేసులో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా పేర్కొన్నారు పోలీసులు. లావణ్య ఇంటిని కూడా సందర్శించి కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఇంకా చదవండి.
5. కేసీఆర్‌కు మరోసారి కోర్టు సమన్లు
మేడిగడ్డ బ్యారేజీ వివాదం... ఎన్నికల ముందు రాజకీయ దుమారం రేపింది. ఆ వివాదం... బీఆర్‌ఎస్ పార్టీని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 17వ తేదీన... కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు కూడా నోటీసులు ఇచ్చింది భూపాలపల్లి జిల్లా కోర్టు. ఇంకా చదవండి.