Jagan London tour has been postponed :  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడో తేదీన కుటుంబసమేతంగా లండన్ వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన ఇంకా వెళ్లలేదు. ఏడో తేదీన వెళ్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి . కానీ ఆ రోజున కూడా వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంంది. దీనికి కారణం పాస్ పోర్టు ఇంకా చేతిలోకి రాకపోవడమే. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ఆయన పాస్ పోర్టును కోర్టులో సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు తీసుకుని మళ్లీ సమయం ముగిశాక కోర్టులోనే సబ్ మిటీ చేయాలి. 


సీఎంగా రాజీనామా చేయడంతో డిప్లొమాట్ పాస్ పోర్టు రద్దు 


జగన్ 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన డిప్లొమాట్ పాస్ పోర్టుకు అర్హత సాధించారు. తన అసలు  పాస్ పోర్టును రద్దు చేసుకుని డిప్లొమాట్ పాస్ పోర్టు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఎప్పుడు రాజీనామా చేశారో అప్పుడు డిప్లొమాట్ పాస్ పోర్టు ఆటోమేటిక్ గా రద్దయిపోతుంది. దీంతో విదేశీ పర్యటనకు వెళ్లేందుకు జగన్ తనకు పాత పాస్ పోర్టును ఐదేళ్లకు పునరుద్ధరించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చినప్పటికీ..  ఐదేళ్ల కాలానికి పాస్‌పోర్టు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఏడాది మాత్రమే చెల్లుబాటయ్యే పాస్ పోర్టును ఇవ్వాలని తెలిపింది. 


రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు


ఐదేళ్లకు పాస్ పోర్టు కావాల్సిందేనని పైకోర్టుకు జగన్


అయితే జగన్ ఈ ఒక్క ఏడాది పాస్ పోర్టుతో సంతృప్తి చెందలేదు. తనకు ఐదేళ్ల పాస్ పోర్టు కావాల్సిదేనని ఆయన పై కోర్టులో అప్పీల్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై విచారణ పూర్తి కాలేదు. సోమవారానికి వాయిదా పడింది. సోమవారం కోర్టులో వచ్చే తీర్పును అనుసరించి ఆయన విదేశీ పర్యటన తేదీలను ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకే సీబీఐ కోర్టు లండన్‌లో పర్యటించడానికి అనుమతి ఇచ్చింది. జగన్ కుమార్తెలు లండన్ లో ఉంటున్నారు. వారిలో ఒకరి పుట్టిన రోజు వేడుకల కోసం సీబీఐ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నాు. కోర్టు అనుమ‌తి రాక‌పోవ‌టం, పాస్ పోర్టు రెన్యూవ‌ల్  ఆల‌స్యం కాబోతుండ‌టంతో మాజీ సీఎం జ‌గ‌న్ లండన్ టూర్ వాయిదా పడినట్లయింది. 


కేసీఆర్‌కు మరోసారి కోర్టు సమన్లు-వచ్చే నెల 17న హాజరుకావాలని ఆదేశం- ఏ కేసులో అంటే?


ఏడాది తర్వాత మళ్లీ పొడిగించుకోవచ్చు కదా.. ఇప్పుడే ఎందుకు ?


జగన్మోహన్ రెడ్డికి లండన్ వెళ్లడానికి ఐదేళ్ల పాటు పాస్ పోర్టు ఎందుకని.. వెళ్లి వచ్చిన తర్వాత కావాలంటే పొడిగింపు కోసం పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు కదా అన్న సందేహాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్తే మళ్లీ తిరిగి వస్తారా లేదా అన్న అనుమానాలు కూడా టీడీపీ నేతలు వ్యక్తం చేస్తూంటారు. ఈ కారణంగా ఈ పాస్ పోర్టు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.