Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబికకు తన లవర్ ఫోన్ చేసి టైం చూసుకొని విహారితో ఫైల్స్ మీద సంతకం పెట్టించమని చెప్తాడు. ఇక విహారి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. అందరి సంతోషం కోరుకునే తన వల్ల ఓ అమాయపు అమ్మాయి ఇబ్బంది పడుతుందని కనకం గురించి ఆలోచిస్తూ ఫీలవుతాడు. ఎక్కడుందో ఎలా ఉందో అని తల పగిలిపోతుందని అనుకుంటాడు.
విహారి: డల్‌గా ఉంటే ఇంట్లో కనిపెట్టేస్తారు. ఆ అమ్మాయిని సేఫ్‌గా ఇంటికి పంపిస్తేనే నాకు మనస్శాంతి. ఏం చేయాలి. అంటూ తన ఫ్రెండ్ ఒకరికి కాల్ చేసి కలవాలని చెప్తాడు. తన ఫ్రెండ్ రావడంతో ప్రకాశ్ చేసిన మోసం మొత్తం అతడితో చెప్తాడు. ఆ ప్రకాశ్ ఇంత ద్రోహం చేస్తాడని అనుకోలేదు. అరే పాపంరా నా వల్ల ఓ ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది.
విహారిఫ్రెండ్: ఆ ప్రకాశ్ గాడు మనిషా పశువారా డబ్బు కోసం ఇంత మోసం చేస్తాడా.
విహారి: నా టెన్షన్ అంతా ఆ అమ్మాయి గురించిరా ఈ విషయంలో నువ్వు నాకు ఓ సాయం చేస్తావా. వాళ్ల విలేజ్కి వెళ్లి ఆ అమ్మాయి అక్కడ ఉందో లేదో చూడు. తను అక్కడే ఉంటే నేను రిలాక్స్ అయిపతా. రేయ్ వాళ్లకి చీరలు నేసే బిజినెస్ ఉంది ఆ ప్లాన్‌తో వెళ్లురా.
విహారిఫ్రెండ్: సరేరా నేను వెళ్లి కనుక్కుంటా.
కనకం: (కనకం గదిలో కూర్చొని ఏడుస్తుంది. సహస్ర వల్ల అయిన గాయం గుర్తు చేసుకొని ఏడుస్తుంది.) నేనేం పాపం చేశాను నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది.
విహారి: మంచి చేయాలి అనుకోవడం తప్పా.
విహారి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు. డోర్ తీయడానికి ఎవరైనా ఉన్నారా లేదా అనుకొని కనకం డోర్ తీయడానికి వెళ్తుంది. విహారి తన ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతాడు. ఇంతలో కనకం డోర్ తీస్తుంది. ఇక ఫోన్‌లో మాట్లాడుతున్న విహారిని చూసి వెళ్లిపోతుంటే అంబిక ఆపి డోర్ తీయడానికి వచ్చావా ఇంకేమైనా ప్లాన్ చేశావా అని కనకాన్ని అవమానిస్తుంది. ఇక కనకం వెళ్లిపోగానే విహారి వస్తాడు. ఇక అంబిక విహారి ఫైల్ మీద సంతకం పెట్టమంటే విహారి ఉదయం చేస్తానని అంటాడు.
కనకం: ఈ ఇంట్లో వాళ్లు నన్ను ఎందుకు శత్రువుగా చూస్తున్నారు. ముఖ్యంగా అంబిక గారు. అమ్మగారు ట్యాబ్లెట్స్ వేసుకున్నారో లేదో అని తీసుకొని వెళ్తుంది. అమ్మగారు ట్యాబ్లెట్స్ వేసుకున్నారా అమ్మగారు. మందుల విషయంతో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.
యమున: నేను మర్చిపోయినా గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదా.
కనకం: ఎక్కడో దిక్కూ ముక్కు లేని నన్ను మీ బంధువు అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో స్థానం ఇచ్చారు.
యమున: దేవుడు ఎవర్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చుతాడు, బహుశా ఆ దేవుడు నిన్ను నాకోసమే పంపాడు.
కనకం: లేదమ్మగారు ఆ దేవుడు మిమల్ని నా కోసం పంపాడు.
యమున: అవును మీ వాళ్లు ఎవరైనా ఫోన్ చేశారా. నిన్ను బాధ పెట్టాలి అని కాదు నువ్వు ఎక్కడున్నా బాగుండాలి బాగుంటావ్.
వసుధ: వసుధ లోపలికి వస్తే బయటకు వెళ్తున్న కనకం ఆమె చేతిలోని తన గాజులు చూస్తుంది.. వదిన నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు లక్ష్మీ నిజంగానే మీ ఊరి అమ్మాయేనా. నేను నిన్ను నమ్ముతా వదినా. తను ఇంటికి వచ్చినప్పుడు జాలి కలిగినా ఇప్పుడు అనుమానం కలుగుతుంది.
యమున: ఒక్క శాతం కూడా తనని అనుమానించడానికి వీల్లేదు వసుధ. తను అద్దం లాంటిది లోపల ఏం ఉంటుందో బయట అదే ఉంటుంది.
వసుధ: లక్ష్మీ నా చేతుల వైపే చూస్తుంది నేను కొత్త గాజులు వేసుకున్నా.
యమున: తను నీ చేతులు గాజులు బాగుండి చూసిందేమో కానీ తనకి డబ్బు మీద నగలు మీద మోజే లేదు నిజంగా తను అలాంటిది అయితే నేను ఇంటికే తీసుకురాను కదా. చూస్తున్నావ్ కదా అందరి తలలో నాలుకగా పనులన్నీ చేస్తుంది అతిథిగా ఉన్న తనని మనవాళ్లు పని మనిషిగా చూస్తున్నా ఏం అనుకోవడం లేదు. తన మీద ఏమైనా చెడు అభిప్రాయం ఉంటే తీసే.
వసుధ: నేను తీసేశా వదినా కానీ ఇలా చూడటం అంబిక, పద్మ అక్క చూస్తే వాళ్లు క్షణం కూడా ఆలోచించరు ఆ పరిస్థితి రాకూడదని నా అభిప్రాయం.
యమున: తన వల్ల ఈ ఇంట్లో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాదు. లక్ష్మీ చాలా మంచి అమ్మాయి ఈ ఇంట్లో తను అవమాన పడే పరిస్థితి రాకూడదు.
ఆదికేశవ్ పేపర్ పట్టుకొని వచ్చి గౌరికి చూపిస్తూ సందడి చేస్తాడు. అందులో విహారి, కనకం ఫొటో వేసుంటారు. ఇక విహారి ఇంటి దగ్గరకు కూడా పేపర్ వస్తుంది. లక్ష్మీని పేపర్ తీసుకురమ్మని తాతగారు చెప్తారు. మరోవైపు అంబిక ఫైల్ తీసుకొని విహారి దగ్గరకు వస్తుంది. సంతకం పెట్టమని అంటుంది. విహారి సరే అంటాడు. సంతకం పెట్టే టైంకి విహారికి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. దాంతో విహారి హాస్పిటల్‌కి వస్తున్నా అని కంగారుగా తర్వాత సంతకం పెడతానని చెప్పి వెళ్లిపోతాడు. ఇక తాతగారు లక్ష్మీకి కళ్లద్దాలు తీసుకురమ్మని చెప్తారు. అయితే యాడ్ చూసే టైంలో కాదాంబరి పిలవడంతో వెళ్లిపోతారు. ఇక గౌరీ, ఆదికేశవ్ కూతురు, అల్లుడి ఫొటో చూసి మురిసిపోతారు. మరోవైపు కనకం ఎన్ని కష్టాలు అయినా భరిస్తాను కానీ తన బాధలు తల్లిదండ్రులకు చెప్పనని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.