Satyabhama Serial Today Episode సత్య కోసం తన ఫ్రెండ్స్ గది బయట వెయిట్ చేస్తుంటారు. సత్య రాగానే ఏమైందని అడుగుతారు. తాను చెప్పిందేదీ క్రిష్‌ వినలేదని మందు తాగి పడుకున్నాడని చెప్తుంది. దాంతో తన ఫ్రెండ్స్ రేపు మళ్లీ చెప్పొచ్చులే అని సత్యకి ధైర్యం చెప్పి పంపేస్తారు. ఇక రాధిక, దీప్తి, జర ముగ్గురు సత్యకి కాలం కలిసి రావడం లేదని పాపం అనుకుంటారు. ఇక సత్య సత్యభామ అవతారం ఎత్తుతుందని క్రిష్‌ శ్రీకృష్ణుడిలా తన కాళ్ల దగ్గర ఫిక్స్ అయిపోతాడని మాట్లాడుకుంటారు. ఇంతలో ముగ్గురు రౌడీలు ముగ్గురికి మత్తు మందు ఉన్న రుమాలుతో వాళ్ల నోర్లు నొక్కి వారిని తీసుకెళ్లిపోతారు.


మరోవైపు సత్య చక్కగా అమ్మవారి గుడికి వెళ్లడానికి రెడీ అయి క్రిష్‌ గురించి వెతుకుతుంది. తనని వదిలేసి గుడికి వెళ్లిపోయింటాడని అనుకొని తనని వదిలి వెళ్లడని అనుకుంటుంది. ఇంతలో జయమ్మ వస్తే క్రిష్‌ తనని పట్టించుకోవడం లేదని అయినా వదలనని చెప్పి క్రిష్ కోసం వెతుకుతుంది. బయట క్రిష్ ఉంటే చూసి అక్కడి వెళ్తుంది. క్రిష్‌ దగ్గరకు వెళ్లి తనకి విడాకులు వద్దని చెప్పాలని అనుకుంటుంది. క్రిష్ దగ్గరకు వెళ్తుంది. ఇంతలో రౌడీలు అక్కడే కాపు కాసి సత్యని కిడ్నాప్ చేస్తారు. క్రిష్ వెనక్కి తిరిగి ఫోన్ మాట్లాడుతుంటే సత్యని చూడకుండా భైరవి క్రిష్‌కి అడ్డుగా వస్తుంది. రౌడీలు సత్యని తీసుకొని కారులో వెళ్లిపోతారు. 


క్రిష్: ఏంటమ్మా చూస్తున్నావ్.
భైరవి: తమాషా చూస్తున్నా అందరూ భద్రకాళీ అమ్మవారి దగ్గరకు బయల్దేరుతుంటే నువ్వు ఆరాంగా ఫోన్ మాట్లాడుకుంటున్నావ్. పద.
క్రిష్: సత్య రావాలి కదా అమ్మ.
భైరవి: అది ఇంకేం వస్తుంది.
క్రిష్: అంటే..
భైరవి: అదేరా మన వెనకాల పూజ సామాను తెస్తుందంట మనల్ని పొమ్మని చెప్పింది రారా.


అందరూ గుడికి వెళ్తారు. పంతులు పూజకు ఏర్పాటు చేస్తారు. మహాదేవయ్య ఫ్యామిలీ, విశ్వనాథం ఫ్యామిలీ మొత్తం వస్తారు. వరలక్ష్మీ వ్రతం చేయడానికి చాలా మంది అక్కడికి వస్తారు. సత్య, క్రిష్‌లు అమ్మవారి దగ్గర వ్రతం చేస్తే మిగతా వారు సామూహికంగా అమ్మవారి ముందు పూజ చేయండని పంతులు చెప్తారు. ఇక క్రిష్, సత్యని పిలుస్తారు. క్రిష్ ఒక్కడే రెడీ అయి వస్తాడు. 



మహదేవయ్య: రేయ్ సత్య ఎక్కడరా.
క్రిష్: అత్తమ్మ సత్య ఎక్కడ. 
విశాలాక్షి: అదేంటి బాబు మీతో రాలేదా. 
క్రిష్: లేదే.
విశ్వనాథం: మీతో ఉందని మేం పట్టించుకోలేదు.
మహదేవయ్య: రేయ్ దిక్కలు చూస్తావేంట్రా ఒకసారి ఫోన్ చేయ్ ఎక్కడుందో తెలుస్తుంది కదా. ఈ టైంలో ఫోన్ ఆపిందేంట్రా. పెళ్లాం ఎక్కడుందో తెలుసుకొని వెంట పెట్టుకొని రావడం తెలీదా నువ్వు ఏం మొగుడివిరా. ఇక్కడే ఎక్కడో ఉంటుంది తీసుకొని రా పో.
జయమ్మ: అది పొద్దున్నే లేచి రెడీ అయిపోయింది. నా కళ్లతో చూశా. 
మహాదేవయ్య: మరి ఏది వ్రతం టైంకి ఎక్కడికి పోయింది.
భైరవి: అది రాదు పెనిమిటి. దానికి మొగుడు అంటే ఇష్టం లేదు. అత్తిళ్లంటే లెక్క లేదు. మొగుడితో కాపురం చేయడం అసలే ఇష్టం లేదు ఎందుకు వస్తుంది.
విశాలాక్షి: వదిన గారు తెలిసి తెలియక నిందలు వేయకండి దానికి మొగుడు అంటే ఇష్టం ప్రేమ. అత్తింటిని తక్కువ చేసి మాట్లాడలేదు. పైగా క్రిష్‌తో కలిసి నూరేళ్లు బతకాలి అనుకుంటుంది  ఆ విషయం నాతో చెప్పింది.
క్రిష్: మనసులో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి సత్య వెళ్లింది. సత్య ఎక్కడున్నా నేను వెతుక్కొని వస్తా.
భైరవి: నిన్ను కాదునుకున్న దాని గురించి నువ్వు వెతకడం ఏంట్రా. నీ పెళ్లానికి నీ మీద ప్రేమ ఉందా. ఇదేంట్రా మరి అని విడాకుల పేపర్లు చూపిస్తుంది.  
క్రిష్: అమ్మా  ఆ పేపర్ నాకు ఇచ్చేయ్. ఇచ్చేయ్ అమ్మా ప్లీజ్.
మహదేవయ్య: ఆ పేపర్లలో ఏముందే.
భైరవి: వినపడుతుందా మీ బాబు ఏం అడుగుతున్నారో. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా. విడిపోవాలని నీ చిన్న కొడుకు కోడలు సంతకం పెట్టిన అగ్రిమెంట్ ఇది. (అందరూ విడాకుల పేపర్లు తీసుకొని చూసి షాక్ అయిపోతారు.) ఇప్పుడేమంటావ్ నేను అబద్ధం చెప్పాను అని అంత ఎత్తుకి లేచావ్ కదా నీ కూతురి జగన్నాటకానికి ఏమంటావ్. మా చిన్నానే నీ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ నీ కూతురు వాడిని మోసం చేసింది. కథ విడాకుల వరకు తెచ్చింది.
మహదేవయ్య: ఏం పంతులివయ్యా నువ్వు కూతురికి సంస్కారం నేర్పుకోలేదు. నీతులు చెప్తావా పాఠాలు చెప్తావా సిగ్గు ఉండాలయ్యా.
హర్ష: మహదేవయ్య గారు.
మహదేవయ్య: నోరు లేపకు ఇది నా ఊరు. నీ చెల్లికి వ్రతం ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి ఇంత ఏర్పాటు చేసిన తర్వాత రాకపోతే నా పరువు ఏం కావాలి. అందరి ముందు క్రిష్ కాలర్ పట్టుకొని మీరు విడిపోవాలి అనుకున్న మాట నిజమేనా.


సత్యని రౌడీలు కుర్చీలో కూర్చొపెట్టి కాళ్లు చేతులు కట్టాలా వద్దా అని మాట్లాడుకుంటారు. మనం ముగ్గురం ఉన్నాం మనల్ని కాదు అని ఏం చేయలేదని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: సాహసం చేసి పంచకమణిని దక్కించుకున్న నయని.. కుట్ర చేసిన గజగండ!