లైవ్‌లో న్యూస్ చెప్పడమంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా జనాల మధ్యలోకి వెళ్లి లైవ్‌లో మాట్లాడటమంటే కత్తీ మీద సామే. ఎవరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఏం చేస్తారో తెలీదు. అక్కడ ఏం జరిగినా.. అదంతా టీవీలో లైవ్‌లో వచ్చేస్తుంది. ఇలాంటి తరుణంలో కొన్ని ఫన్నీ సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి అక్కడ లైవ్‌లో సమాచారం అందించే రిపోర్టలకు కోపం కూడా వస్తుంది. అయితే, లైవ్‌లో అవేవీ కనిపించకుండా జాగ్రత్తపడతారు. కానీ, పాకిస్తాన్ జర్నలిస్ట్ మాత్రం అలా చేయలేదు. తన కోపాన్ని అక్కడే ప్రదర్శించి బాలుడి చెంప పగలగొట్టింది.
జనాల మధ్యలో నిలబడి మాట్లాడుతున్న రిపోర్టర్‌ను ఓ బాలుడు బాగా డిస్ట్రబ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె లైవ్‌లో సమాచారం ఇచ్చిన వెంటనే.. ఆ బాలుడి చెంప పగలగొట్టింది. అయితే, ఆమె అతడిని ఎందుకు కొట్టిందనేది క్లారిటీ లేదు. ఆమె మాట్లాడుతున్న సందర్భంలో అనవసరమైన వ్యాఖ్యలు చేయడం వల్లే ఆమెకు కోపం వచ్చి కొట్టిందని తెలుస్తోంది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. సుమారు 5 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. అయితే, ఆమె ఎందుకు ఆ బాలుడిని కొట్టిందో తెలియక అంతా జుట్టు పీక్కుంటున్నారు. కొందరు మాత్రం రకరకాలుగా ఊహించుకుంటూ తమకు తోచిన కామెంట్లు చేస్తున్నారు. ఎవరెవరు ఏమంటున్నారనేది ఈ కింది ట్వీట్లలో చూడండి.
కొద్ది రోజుల కిందట పాకిస్థానీ పాకిస్థానీ జర్నలిస్ట్ చాంద్ నవాబ్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ చాంద్ అంటే ఇండియన్స్ కూడా చాలా ఇష్టం. అతడు రిపోర్టింగ్ చేసే తీరు కడుపుబ్బా నవ్వించడమే ఇందుకు కారణం. అతడు కరాచీలో ఇసుక తుఫాన్ గురించి సమాచారం అందిస్తూ.. అక్కడ వీస్తున్న బలమైన గాలులకు సన్నగా, బలహీనంగా ఉండే వ్యక్తులు ఎగిరిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించడం నవ్వులు పూయించింది. అంతటితో ఆగకుండా ఒంటె మీదకు ఎక్కి మరీ అతడు రిపోర్టింగ్ చేశాడు. ఆ వీడియోను ఇక్కడ చూడండి.
Also read: డయాబెటిక్ రోగులు నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే వదలకుండా తింటారు
Also read: పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా? అయితే ఈ ఆహారాలు తరచూ తినిపించండి