Viral Video : ఆ రిపోర్టర్ లైవ్‌లో రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతలోనే హఠాత్తుగా ఆమె చేయి పైకి లేచింది. ఎదురుగా ఉన్న వ్యక్తి చెంప పగలగొట్టింది. దీంతో అక్కడ ఉన్నవారందరూ షాకయ్యారు. ఏం జరిగిందో చాలా మందికి తెలియదు. ఆమె చెప్పలేదు. తర్వాత తన రిపోర్టింగ్ తాను చేసుకుని వెళ్లిపోయింది. కానీ ఆ వీడియో మాత్రం వైరల్ అయింది.
అయితే ఆమె ఇండియా రిపోర్టర్ కాదు. పాకిస్తాన్ కు చెందిన మీడియా రిపోర్టర్. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఆమె విధులు నిర్వహిస్తోంది. అయితే ఆమె తీరుపై పాకిస్తాన్ సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమయింది. అనవసరంగా ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
అయితే తాను తప్పేం చేయలేదని ఆ రిపోర్టర్ ఉర్దూలో వివరణ ఇచ్చింది. తాను రిపోర్ట్ చేస్తున్న కుటుంబాన్ని ఆ వ్యక్తి అదే పనిగా హరాస్ చేస్తున్నాని... తాను ఎంత చెప్పిన వినలేదని... అందుకే కొట్టానని తెలిపింది. అలాంటి వ్యక్తిని వదిలేద్దామా అని ప్రశ్నించింది కూడా.
మొత్తానికి ఆమె పేరు మైరా హష్మి. న్యూస్ యాంకరింగ్‌కు గ్లామర్ అద్దడంలో ఆమె ప్రత్యేకత . అందుకే ఆమె గురించి ప్లస్ అయినా.. మైనస్ అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌లోనే కాదు.. ఇండియాలో కూడా.