పాములకు వేసవి కాలం అస్సలు ఇష్టం ఉండదు. ఈ రోజుల్లో అవి నీడ కోసం పాకులాడతాయి. చల్లగా, తేమ కలిగిన ప్రాంతాల కోసం వెతుకుతాయి. దీంతో అవి మీ ఇళ్లలోకి దూరే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు, మీరు బయట పార్క్ చేసే వాహనాల్లో సైతం పాములు చేరి.. సేద తీరే అవకాశం ఉంది. కాబట్టి, మీరు వేసవిలో వాహనాలను నడిపే ముందు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా చిన్న చిన్న పాములు సందుల్లో, ఇరుకుగా.. చీకటిగా ఉండే ప్రాంతాల్లో తలదాచుకోడానికే ప్రాధాన్యమిస్తాయి. ఇదిగో ఈ పాము కూడా ఆ టైపే. ఎక్కడా చోటు దొరకనట్లు అది వ్యాన్‌లో నక్కింది. ఆ వ్యాన్ యజమాని కొంత దూరం వెళ్లిన తర్వాత.. బయటకు వచ్చి హడలగొట్టింది. 70 కిమీల వేగంలోనూ.. పడిపోతాననే భయం కూడా లేకుండా ఆ పాము థ్రిల్‌గా ఫీలైంది. కానీ, చివరికి... 


ఇంగ్లాండ్‌లోని స్టాఫోర్డ్‌షైర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చార్లీ బ్రిస్టోన్ అనే యువకుడు తన తండ్రితో కలిసి వ్యాన్‌లో వెళ్తున్నాడు. ఇంతలో వ్యాన్ బానెట్‌లో నుంచి ఓ పాము బయటకు వచ్చింది. ఆ తర్వాత అది వ్యాన్ కుడివైపు అద్దం వైపుకు పాకింది. ఆ సమయానికి వ్యాన్ సుమారు 70 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తూ.. కాసేపు జర్నీని ఎంజాయ్ చేసిన ఆ పాము అలా ప్రయాణించడం ప్రమాదమని భావించిందో ఏమో.. మళ్లీ బానెట్ వైపుకు వెళ్దామని ప్రయత్నించింది. కానీ, పట్టుతప్పి రోడ్డు మీద పడిపోయింది. ఆ తర్వాత ఏమైందనేది మాత్రం తెలియరాలేదు. ఈ వీడియో ఇప్పుడు ‘టిక్ టాక్’లో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. అయితే, పాము కనిపించిన వెంటనే వ్యాన్‌ను పక్కకి ఆపి దాన్ని పంపేసి ఉంటే అది ప్రాణాలతో ఉండేదని నెటిజనులు అంటున్నారు. రోడ్దు మీద పడిపోవడం వల్ల ఆ పామును ఇతర వాహనాలు తొక్కేసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ వీడియో చూసి మీ అభిప్రాయం కూడా చెప్పండి. 


Also Read: లక్కున్నోడు - 34 ఏళ్లుగా భార్య వద్దన్నా వినలేదు, ఇప్పుడు రూ.2.5 కోట్లతో ఆమెకు షాకిచ్చాడు!



Also Read: ఛీ యాక్, టాయిలెట్ రంథ్రంలో ఇరుక్కున్న తల, ఆమె అందులోకి ఎలా దూరింది?


ఒక్కోసారి ఇలా కూడా భయపెడతాయి: