పాము అనగానే భయంతో ఎగిరి గంతేసేవాళ్లు చాలామంది. అక్కడ పాము ఉందో లేదో కూడా చూసుకోకుండా.. పరుగులు పెట్టేస్తారు. అలాంటివారికి నాగు పాము లేదా నల్ల తాచు పాములు ఎదురైతే? ఇంకేముంది.. ప్రాణాలు గాల్లో కలిసిపోవడం పక్కా. 


ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(IFS) అధికారి సుశాంత్ నందా ఇటీవల ఓ కోతి.. బాతులతో కలిసి పుచ్చకాయ తింటున్న వీడియోను పోస్టు చేశారు. దాని కింద ఎన్.ఎస్.సుకుమార్ అనే వ్యక్తి మరో వీడియోను పోస్ట్ చేశాడు. దాన్ని చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. 


Also Read: హెలికాప్టర్‌ను కూల్చేసిన షార్క్, కిరణ్ బేడీని తిట్టిపోస్తున్న నెటిజన్స్, ఎందుకంటే..


ఓ వ్యక్తి.. అత్యంత విషపూరితమైన నల్ల తాచుపాముకు నీళ్లు పట్టిస్తున్నాడు. ఆ పాము కూడా అతడిని ఏమీ చేయకుండా గ్లాసులో తల పెట్టి నీళ్లు గడగడ తాగేసింది. సాధారణంగా పాములు చాలా వేగంగా ఉంటాయి. ఆ నీళ్ల గ్లాసు పట్టుకున్న వ్యక్తిని సెకన్ల వ్యవధిలో అది కాటేయగలదు. ఆ వ్యక్తి కూడా ఆ నీటిని ఏదైనా ప్లేటులో వేసి పెట్టవచ్చు. కానీ, ఆ సమయంలో అతడికి అలాంటి పాత్రలేవీ కనిపించలేదు. అందుబాటులో ఉన్న గ్లాసులోనే నీళ్లు పోసి తాగించాడు. ఒక వేళ ఆ గ్లాస్ కింద పెట్టి ఉంటే ఆ పాము తాగడానికి ఇబ్బందిపడేది. అలాగే ఆ గ్లాసు నీళ్లు నేలపాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ధైర్యాన్ని నెటిజనులు మెచ్చుకుంటున్నారు. నీ ప్రాణాలకు తెగించి మరీ మరో ప్రాణికి సాయం చేశావని అంటున్నారు. అలాగే, ఆ పాము కూడా తనకు నీళ్లు పట్టించిన వ్యక్తిని ఏమీ చేయకుండా వదిలేయడాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరు కూడా చూసేయండి. 


Also Read: వీడియో - అపస్మారక స్థితిలో పైలట్‌, అనుభవం లేకున్నా సేఫ్‌గా ల్యాండ్ చేసిన ప్రయాణికుడు