వీగనిజం... ఇప్పుడు ఎక్కువమంది పాటిస్తున్న ఆహార పద్ధతి ఇది. మాంసాహారమే కాదు, జీవ సంబంధమైన ఏ ఆహారాన్ని కూడా వారు తినరు. తేనె, పాలు, పెరుగు వంటివి కూడా ముట్టుకోరు. ఇలాంటి వారి కోసమే వేగన్ చికెన్ కనిపెట్టారు. ఇది చికెన్ రుచిని అందిస్తుంది. 


కావాల్సిన పదార్థాలు
గోధుమ గ్లూటెన్ - ఒక కప్పు
చిక్ పీస్ (శెనగలు) పిండి - పావు కప్పు
ఈస్ట్ - పావు కప్పు
ఉల్లిపాయ పొడి - ఒక స్పూను
వెల్లుల్లి పొడి - ఒక స్పూను
ఉప్పు - ఒక స్పూను
నల్ల మిరియాలు - అర స్పూను
కూరగాయల జ్యూస్ - ముప్పావు కప్పు
సోయా సాస్ - రెండు స్పూన్లు
ఆలివ్ నూనె - రెండు స్పూన్లు


తయారీ ఇలా
 1. ఒక గిన్నెలో గోధుమ గ్లూటెన్, ఈస్ట్, చిక్ పీ పిండి, ఉల్లిపాయల పొడి, వెల్లుల్లి పొడి, ఉప్పు, నల్ల మిరియాలు వేసి కలపండి. 
2. మరొక గిన్నెలో కూరగాయల జ్యూస్, సోయా సాస్, ఆలివ్ నూనె వేసి కలపాలి.
3. రెండు గిన్నెల్లో ఉన్న పదార్థాలను కలిపేయాలి. కొన్ని నిమిషాల పాటూ బాగా చేత్తో పిండిని కలపాలి. 
4.  వాటిని నగ్గెట్స్ లేదా కట్‌లెట్‌లా చేత్తో ఒత్తుకోవాలి. 
5. స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక నగ్గెట్స్ ను వేయించుకోవాలి. 
6. 20 నిమిషాలు వేయిస్తే గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారుతాయి. 
ఇవి తింటే చికెన్ తిన్నట్టే ఉంటుంది. 


తింటే ఎన్ని లాభాలో?
మాంసాహార చికెన్‌తో పోలిస్తే ఈ వేగన్ చికెన్‌లో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. మాంసాహారంతో పోలిస్తే ఈ చికెన్ ఎంతో ఆరోగ్యకరం. ఈ చికెన్లో కూడా ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తింటే ఎంతో మేలు. వేగన్ చికెన్ ను తినడం వల్ల జంతు వధ కూడా తగ్గుతుంది. సెలెబ్రిటీలంతా ఇప్పుడు వీగనిజాన్ని పాటిస్తున్నారు. అనుష్క, విరాట్ కోహ్లీ కూడా వీగనిజాన్ని పాటిస్తున్నారు.  


తినేవి ఇవే...
వీగన్లుగా మారినవారు కేవలం మొక్కల ఆధారిత ఆహారాన్నే తింటారు. కూరగాయలు, పండ్లు, బీన్స్, పప్పు ధాన్యాలు, నట్స్, బ్రెడ్ వంటివి తింారు. పోషకాహార లోపం లేకుండా జాగ్రత్త పడతారు. అయితే వీగన్ ఆహారంలో అయోడిన్ లోపం వచ్చే అవకాశం ఉందని, దీని వల్ల మెదడు, థైరాయిడ్ సమస్యలు రావొచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. వీగన్లుగా హఠాత్తుగా మారడం కష్టమే. ఒకేసారి ఆహారంలో మార్పులు రావడాన్ని శరీరం తట్టుకోలేకపోవచ్చు.  కాబట్టి నెమ్మదిగా ఆహారంలో మార్పులు చేసుకుంటూ వీగన్లుగా మారాలి. 


Also read: సోయాతో చేసిన మీల్ మేకర్‌ను మగవారు తినకూడదని అంటారు, ఇది ఎంతవరకు నిజం?



Also read: రోజులో 9 గంటలకు మించి నిద్రపోతున్నారా? అతి నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే









































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.