Hair Care Routine : సోషల్ మీడియాలో ఈ మధ్య బ్యూటీ, హెయిర్​ గురించి చాలా టిప్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకోసం వివిధ DIYలు, హెయిర్ ఆయిల్స్​ బాగా ట్రెండ్​లోకి వస్తున్నాయి. జుట్టు పెరుగుదల కోసమని.. జుట్టు రాలడం కంట్రోల్ చేసుకోవాలని వివిధ టిప్స్ ఫాలో అవుతున్నారు. అయితే అవి ఎంతవరకు పనిచేస్తాయో.. హెయిర్ నిజంగా పెరుగుతుందో.. ఊడుతుందో అనే భయం కూడా ఉంటుంది. మీకు కూడా అలాంటి డౌట్స్ ఉన్నాయా? అయితే ఇది మీకోసమే.


రోజ్మేరీ ఆయిల్​ (Rosemary Oil) గురించి.. రోజ్మేరీ వాటర్(Rosemary Water) గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు బాగా హెల్ప్ చేస్తాయని ఇన్​ఫ్లూయెన్సర్స్ చెప్తున్నారు. అయితే ఇవి నిజంగా పని చేస్తున్నాయనే ప్రశ్న మీలో ఉంటే.. దానికి నిపుణులు కచ్చితంగా ఎస్ చెప్తున్నారు. రోజ్మేరీ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుందని తెలిపారు. అయితే దీనిలో కొన్ని మిక్స్ చేయడం వల్ల మీరు మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు అంటున్నారు. 


రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలను, జుట్టుకు పోషణ అందించడంలో హెల్ప్ అవుతుంది. అయితే మీరు రోజ్మేరీ ఆయిల్​ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వేడి చేసిన ఆలివ్ నూనెలో రోజ్మోరీ ఆకులను వేయండి. దానిని వేడి చేయకుండా.. పూర్తిగా చల్లారనివ్వాలి. దానిని మరోసీసాలోకి మార్చండి. మెరుగైన ఫలితాల కోసం ఈ నూనెను మీరు వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయవచ్చు. 


జుట్టుకు కలిగే ప్రయోజనాలు


రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తుంది. క్రమంగా జుట్టు రాలడాన్ని నివారించి.. హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చుండ్రు, దురద వంటి స్కాల్ప్ సమస్యలతో పోరాడతాయి. ఇది చుండ్రును దూరంచేసి మంచి స్కాల్ప్​ను అందిస్తాయి. దీనిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గించి.. స్కాల్ప్​ ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి. 


ఈ ఆయిల్​ను రెగ్యూలర్​గా ఉపయోగించడం వల్ల జుట్టు తంతువులు బలంగా మారుతాయి. జుట్టు బ్రేక్ అయ్యే అవకాశం కూడా తగ్గిపోతుంది. ఇది మొత్తం జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది. జుట్టుకు సహజమైన మెరుపును అందిస్తుంది. అంతేకాకుండా హెయిర్ ఆరోగ్యంగా, దృఢంగా కనిపిస్తుంది. నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు, మెత్తం స్కాల్ప్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. 


రోజ్మేరీ వాటర్​తో..


రోజ్మేరీ ఆయిల్​ మాత్రమే కాదు.. నీటిని కూడా మీరు హెయిర్​ గ్రోత్​కి ఉపయోగించవచ్చు. స్టౌవ్ వెలిగించి .. ఓ గిన్నెలో నీరు తీసుకుని దానిలో రోజ్మేరీ ఆకులు వేసి మరిగించాలి. అనంతరం స్టౌవ్ ఆపేసి వాటిని నీటిని చల్లారనివ్వాలి. వాటిని వడకట్టి స్ప్రె బాటిల్​లో వేసి రోజూ రాత్రి పడుకునేముందు తలపై స్ప్రే చేయాలి. ఇలా రెగ్యూలర్​గా చేయడం వల్ల జుట్టు పెరుగుదల బాగుండటంతో పాటు.. ఆకృతి కూడా మారుతుంది. 


Alsa Read : మాత్ర వేసుకోకుండా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.. ఇవే సింపుల్ చిట్కాలు



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.