Reduce Headache : తలనొప్పి వేధిస్తున్నప్పుడు బాబోయ్ ఓ ట్లాబెట్ వేసుకోవాలి. లేకుంటే నొప్పి తగ్గేలా లేదు అనే ఆలోచన వస్తుంది. మాత్ర వేసుకున్న కొంచెం సేపటికి కాస్త రిలీఫ్​గా ఉంటుంది. అయితే ప్రతిదానికి మెడిసిన్ వేసుకోవడం అంత మంచిది కాదు. అయితే మీరు కొన్ని సహజమైన మార్గాలలో తలనొప్పిని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. 


శారీరక, మానసిక మార్పుల వల్ల తలనొప్పి వస్తుంది. పనిలో ఒత్తిడి పెరిగినప్పుడు కూడా ఇది వచ్చే ప్రమాదముంది. ఇది మీ మానసిక స్థితిని నాశనం చేస్తుంది. సమ్మర్​లో చాలామంది డీహైడ్రేషన్​కు గురవుతారు. దీనివల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే మీరు నిత్యం దీనితో ఇబ్బంది పడుతుంటే.. మాత్రలు మానేసి.. సహజమైన మార్గాల్లో దానిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. తలనొప్పిని సహజంగా ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


అరోమా థెరపీ


తలనొప్పిని సహజంగా వదిలించుకోవడానికి అరోమా థెరపీ సహజమైన మార్గంగా చెప్పవచ్చు. మీకు నచ్చిన సువాసనను ఎంచుకోండి. జాస్మిన్, లావెండర్ వంటి సువాసనలు ఒత్తిడిని తగ్గించి తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తాయి. ఇవి క్యాండిల్స్ రూపంలో అందుబాటులో ఉంటాయి. ఆ సమయంలో మీరు ఫోన్​కు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటే మంచిది. లావెండర్, యూకలిప్టస్ వంటి నూనెల్లోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు తలనొప్పిని తగ్గించడమే కాకుండా ఇంద్రియాలకు ఉపశమనం కలిగిస్తాయి. 


ఆక్యుప్రెషర్ ప్రయత్నించండి..


ఆక్యుప్రెషర్ అనేది సాంప్రదాయమైన చైనీస్ హీలింగ్ టెక్నిక్. ఇది తలనొప్పి నుంచి ఉపశమనం ఇవ్వడమే కాకుండా.. శరీరంపై నిర్దిష్ట బిందువులపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల మీకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆక్యుప్రెషర్ పాయింట్లు ప్రేరేపించడం వల్ల తలనొప్పి సమస్య తగ్గడంతో పాటు.. ఫ్రీక్వెంట్​గా రావడం కూడా తగ్గుతుంది. 


ఒత్తిడిని తగ్గించుకుంటే.. 


ఒత్తిడి తలనొప్పిని, మైగ్రేన్​ను ప్రేరేపిస్తుంది. వివిధ కారణాలతో కొన్నిసార్లు ఒత్తిడికి గురికావచ్చు. ఆ సమయంలో డీప్​ బ్రీత్ తీసుకోవడం, ధ్యానం, యోగా వంటివాటిని చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. నచ్చని ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు నచ్చిన ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా ఒత్తిడి తగ్గుతుంది. 


నీరు ఎక్కువగా తాగాలి..


డీహైడ్రేషన్​ తలనొప్పికి దారి తీస్తుంది. ఏ కారణంతో అయినా తలనొప్పి వస్తుంటే.. పుష్కలంగా నీరు తాగాలని గుర్తించుకోండి. ఇది మీరు హైడ్రేటెడ్​గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాల్సిందే. ముఖ్యంగా వాతావరణం వేడిగా ఉన్నప్పుడు నీటిని మంచిగా తీసుకోవాలని గుర్తించుకోవాలి. 


కోల్డ్ కంప్రెస్ 


నుదిటిపై లేదా మెడకు కోల్డ్ కంప్రెస్ వేయడం వల్ల తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. ఇది వేగంగా, ప్రభావవంతగా పనిచేస్తుంది. కోల్డ్ థెరపీ రక్తనాళాలను సంకోచించేలా చేస్తుంది. మంటను తగ్గించి.. ఆ ప్రాంతాన్ని తిమ్మిరి లక్షణాలకు దూరం చేస్తుంది. తలనొప్పి వంటి అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. 


Also Read : ఖర్జూరంతో ఫేస్​ ప్యాక్.. దీనితో ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.