Face Pack for Glowing Skin : ఖర్జూరాలను చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసం తీసుకుంటారు. స్వీట్లకు ప్రత్యామ్నయంగా కూడా దీనిని సేవిస్తారు. మధుమేహమున్నవారు కూడా తమ స్వీట్ క్రేవింగ్స్‌ను తగ్గించుకోవడం కోసం డేట్స్‌ను ఆశ్రయిస్తారు. జుట్టు సమస్యలను దూరం చేసుకోవడానికి కూడా చాలా మంది ఖర్జూరాలను తింటారు. చర్మ ప్రయోజనాలకు కూడా ఖర్జూరం చాలా మంచిది. అయితే ఈ ప్రయోజనాల కోసం డేట్స్‌ను నేరుగా డైట్లో చేర్చుకుంటారు. లేదంటే స్మూతీలు, వివిధ రకాల ఫుడ్స్లతో కలిపి సేవిస్తారు.
ముఖం మెరిసిపోయేందుకు, మృతకణాలను తొలగించుకునేందుకు డేట్స్‌ని మీరు నేరుగా తీసుకోవడమే కాదు.. వాటితో ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు తెలుసా? ఖర్జూరాలతో చేసిన ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది అంటున్నారు నిపుణులు. మరి ఖర్జూరాలతో ఫేస్ ప్యాక్‌ను ఏ విధంగా తయారు చేసుకోవచ్చో? దీనివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డేట్స్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలంటే..
డేట్స్ ఫేస్ ప్యాక్‌ను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఖర్జూరాలను రాత్రంతా.. పాలలో నానబెట్టాలి. మరుసటి రోజు మలాయ్తో కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనిలో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఓ రెండు నిమిషాలు అలాగే ఉంచి.. వృత్తాకార దశలో మర్దన చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ సున్నితమైన ఎక్స్‌ఫోలియంట్‌గా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి.. మృదువైన, మెరుగైన ఛాయను అందిస్తుంది.
డేట్స్ ఫేస్ ప్యాక్‌తో ప్రయోజనాలు
ఖర్జూరంతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ట్రై చేయడం వల్ల దానిలోని విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా శరీరానికి అందుతాయి. ఇవి చర్మాన్ని తేమగా, పోషణగా ఉంచడంలో సహాయం చేస్తాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయం చేస్తాయి. వృద్ధాప్య సంకేతాలను తగ్గించి.. యవ్వనమైన చర్మాన్ని ప్రోత్సాహిస్తాయి. వీటిలోని సహజమైన చక్కెరలు, ఎంజైమ్‌లు సున్నితమైన ఎక్స్ఫోలియెంట్లుగా పనిచేస్తాయి. ఇవి డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి.. మృదువైన ఛాయను అందిస్తాయి.
డేట్స్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ మీకు హైడ్రేషన్ అందిస్తుంది. మీకు పొడిబారిన చర్మం ఉంటే ఇది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. చర్మసంరక్షణలో ఎక్స్ఫోలియేషన్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ డేట్స్ ఫేస్ పూర్తిగా న్యూటిషయన్ లక్షణాలతో నిండి ఉంటుంది. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాకుండా చర్మాన్ని తేమగా చేసి మంచి పోషణను అందిస్తుంది.
ఖర్జూరంలోని విటమిన్ సి, విటమిన్ ఇ వంటి విటమిన్లు చర్మ సంరక్షణలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి మెరిసే, హెల్తీ స్కిన్‌ను మీకు అందిస్తాయి. ఖర్జూరంలో జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. చర్మాన్ని చికాకులు, మంట వంటి సమస్యలనుంచి దూరం చేస్తాయి. సమ్మర్లో టాన్ అయినా.. చర్మంపై ఎర్రని మచ్చలను తగ్గించి.. మెరిసే చర్మాన్ని అందిస్తాయి. దీనిని రెగ్యూలర్‌గా అప్లై చేయడం వల్ల చర్మం మరింత కాంతివంతగా తయారవుతుంది.
Also Read : బరువు తగ్గాలనుకుంటే స్మూతీలు తాగకూడదట.. ఎందుకంటే..