మ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అమ్మే లేకపోతే.. ఈ జన్మే ఉండదు. అందుకే, అమ్మను జీవితాంతం గుర్తుపెట్టుకోవడం కోసం చాలా మంది ‘అమ్మ’ పేరును పచ్చబొట్టు(టాటూ)గా పొడిపించుకుంటారు. కానీ, ఇతడేమిటో అమ్మతో ఏకంగా కరిపించుకున్నాడు. తన అమ్మను జీవితాంతం గుర్తుంచుకోవడం కోసం.. ఆమె కరిచిన చోట పడిన గాట్లను టాటూగా మార్చుకున్నాడు. 


అమెరికాకు చెందిన సింకో మగల్లాన్స్ అనే యువకుడు టిక్‌టాక్‌లో ఓ వీడియోను షేర్ చేశాడు. టాటూ షాపుకు వెళ్లిన అతడు ఛైర్‌లో కూర్చొని ఉండగా.. అతడి తల్లి గట్టిగా అతడి తొడను కరిచింది. దీంతో అక్కడ పంటి గాట్లు ఏర్పడ్డాయి. అయితే, ఆమె అది కావాలని చేయలేదు. కొడుకు వింత కోరికను కాదనలేక ఓకే చెప్పింది. పంటిగాట్లను చూడగానే ఆమె బోరున ఏడ్చేసింది. ఆ తర్వాత కళ్లు తుడుచుకుని థంబ్స్అప్ చేసింది. సింకో తన తల్లిని ఓదార్చి.. వెంటనే వాటిని టాటూగా మార్పించుకున్నాడు.


అయితే, ఆ టాటూ పెయిన్ కంటే తల్లి కరిచిన నొప్పే ఎక్కువ నొప్పి కలిగించిందని అతడు అన్నాడు. అయితే, నెటిజన్స్ మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ ఐడియా పెద్ద గొప్పగా లేదని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం.. కాస్త చిత్రంగా ఉన్నా, బాగుందని అంటున్నారు. మరికొందరు మాత్రం ఎలా స్పందించాలో తెలియడం లేదని అంటున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. అదే మా అమ్మ కరిస్తే అక్కడి నుంచి పారిపోతానని అన్నాడు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటీ? 


Also Read: లేజీ ఫెలో, చెప్పులేసుకోడానికి బద్దకమేసి ఏం చేశాడో చూడండి
Also Read: ఈ ఇల్లు వరదల్లో మునగదు, చుక్క నీరు కూడా ఇంట్లోకి చేరదు