టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఛైర్మన్‌గా ఆకాశ్ అంబానీ ఎంపికయ్యారు. బోర్డు మంగళవారం ఆయన నియామకాన్ని ఆమోదించింది. అదే సమయంలో జియో డైరెక్టర్ పదవి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తప్పుకున్నారు. జూన్ 27 నుంచి ఇది కొనసాగుతుంది.
రమీందర్ సింగ్ గుజరాత్, కేవీ చౌదరీ ఐదేళ్ల కాలానికి జియో డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. 2022, జూన్ 27 నుంచి వారి పదవీకాలం మొదలవుతుంది. కాగా పంకజ్ మోహన్ పవార్‌ను ఐదేళ్ల కాలానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. 2022, జూన్ 27 నుంచి ఆయన పదవీకాలం మొదలవుతుంది.
Also Read: ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని వాడుతున్నారా? జులై 1 నుంచి కేంద్రం నిషేధం.. వాడితే పనిష్మెంట్!!
Also Read: గ్యాప్‌డౌన్ నుంచి 600 పాయింట్ల ర్యాలీ! ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
జియో ఆరంభం నుంచి ఆకాశ్ అంబానీ కీలకంగా ఉన్నారు. దగ్గరుండి ప్రణాళికలను అమలు చేశారు. జియో వాటాల అమ్మకం, ఇతర కంపెనీల విలీనాలను ఆయన పర్యవేక్షించారు. ప్రస్తుతం దేశంలో 5జీ శకం ఆరంభం కాబోతోంది. స్పెక్ట్రమ్ వేలం పనులు మొదలవుతున్నాయి. కాగా ఒక యూజర్‌పై సగటు ఆదాయం (ARP) పెంచుకోవాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. ఇండస్ట్రీలో రాణించాలని ఇది తప్పదు. ఇలాంటి సమయంలో ఆకాశ్ బాధ్యతలు తీసుకోవడం గమనార్హం.