ఒకప్పుడు హీరోయిన్లు రిలేషన్ లో ఉన్నా.. ఆ విషయాన్ని బయటకు చెప్పేవారు కాదు. కానీ రోజులు మారాయి.. హీరోయిన్లు తమ లవ్ లైఫ్ గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నారు. తాము సింగిల్ కాదంటూ ప్రకటించుకుంటున్నారు. బాయ్ ఫ్రెండ్ తో తీసుకున్న క్లోజ్ ఫొటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హీరోయిన్ అవికా గోర్ కూడా ఇదే చేస్తుంది. కొన్నాళ్లక్రితం తను ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది అవికా గోర్. 


మిలింద్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తన లైఫ్ మిలింద్ ఒక భాగమంటూ చెప్పుకొచ్చింది. తనలో వచ్చిన మార్పులకు మిలిందే కారణమంటూ చెప్పుకొచ్చింది. మిలింద్ తన లైఫ్ లోకి వచ్చిన తరువాత తనతో కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందని.. తన సామర్ధ్యం ఏంటో తనకు అర్థమైందని చెప్పుకొచ్చింది. ఏదైనా చేయగలననే నమ్మకం వచ్చిందని తెలిపింది. 


తను ఆలోచిస్తున్న దానికంటే ఇంకా చాలా చేయగలనని తెలుసుకునేలా మిలింద్ చేశాడని పేర్కొంది. తను బరువు తగ్గడం దగ్గర నుంచి నిర్మాతగా మారడం వరకు ప్రతి అడుగులో మిలింద్ ఉన్నాడని.. ఈ జర్నీలో తనకు అండగా నిలబడ్డాడని చెప్పుకొచ్చింది. అతడు లేకపోతే ఇదంతా చేయలేనని బాయ్ ఫ్రెండ్ ను తెగ పొగిడేసింది అవికా గోర్. 


ఒకప్పుడు టాలీవుడ్ లో ఈమెకి చాలానే అవకాశాలు వచ్చాయి. కానీ ఈ మధ్య తగ్గాయి. ఆమె నటిస్తోన్న సినిమాలకు కూడా పెద్దగా బజ్ రావడం లేదు. రీసెంట్ 'టెన్త్ క్లాస్ డైరీస్' అనే సినిమాలో నటించింది. అలానే నాగచైతన్య 'థాంక్యూ' సినిమాలో కీలకపాత్ర పోషించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read: అప్పుడు జానీ డెప్ వద్దన్నారు - ఇప్పుడు 'సారీ' చెప్పి రూ.2355 కోట్లు ఇస్తామంటున్నారు!


Also Read: థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్