High Uric Acid : యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో సహజంగా తయారయ్యే టాక్సిన్లలో ఒకటి. ఈ వ్యర్థం శరీరంలో ఎక్కువ మోతాదులో పేర్కొంటే వివిధ సమస్యలు వస్తాయి. మనం తినే కొన్ని ఆహారాల్లో ఉండే ప్యూరిన్స్ జీర్ణం అయినప్పుడు యూరిక్ యాసిడ్ తయారవుతుంది. సాధారణంగా ఇది రక్తంలో కలిసిపోయి కిడ్నీల ద్వారా మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుంది. అలా వెళ్లకుండా పేరుకుపోయినప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయి. 

Continues below advertisement

శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా తయారవ్వడం లేదా కిడ్నీలు దాన్ని పూర్తిగా బయటకు పంపలేకపోవడం వల్ల రక్తంలో దీని స్థాయిలు పెరిగిపోతాయి. అప్పుడు కీళ్లలో చిన్న చిన్న క్రిస్టల్స్ ఏర్పడి నొప్పి, వాపు వంటి సమస్యలు రావచ్చు. ఈ ప్రక్రియను గౌట్ అంటారు.

యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలు

రెడ్ మీట్, సీ ఫుడ్ ఎక్కువగా తినడం, నీళ్లు తక్కువ తాగడం, మద్యం సేవించడం, ఊబకాయం, కిడ్నీ సమస్యలు, డయాబెటిస్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు శరీరంలో యూరిక్ యాసిడ్ పెంచుతాయి. అలాగే ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా ఇది ఎక్కువ అవుతుంది.

Continues below advertisement

యూరిక్ యాసిడ్ పెరిగితే కనిపించే లక్షణాలు

యూరిక్ యాసిడ్ శరీరంలో పెరిగితే అది పూర్తిగా హానికరం కాదు. నిజానికి ఇది ఒకరకంగా యాంటీఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. కానీ దీని స్థాయిలు చాలా తగ్గిపోయినా.. పెరిగినా.. శరీర కణాల రక్షణ తగ్గి తరచూ అలసట, నీరసం, బలహీనత వంటి సమస్యలు కనిపించవచ్చు.అలాగే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు, పాదాల వేళ్లలో వాపు, నడవడంలో ఇబ్బంది, కాళ్లు, మోకాళ్లలో మంట యూరిక్ యాసిడ్ పెంపునకు లక్షణాలు. దీనివల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం కూడా రెట్టింపు అవుతుంది. 

యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేయాలంటే..

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు నీరు ఎక్కువగా తాగాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ తగ్గిస్తే మంచిది. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడంతో పాటు.. ఆల్కహాల్, షుగర్ డ్రింక్స్ తగ్గించాలి. పరిస్థితి తీవ్రమనిపిస్తే కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. 

యూరిక్ యాసిడ్ లెవల్స్ ఎక్కువగా ఉన్నా.. చాలా తక్కువగా ఉన్నా ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే సమతుల్య స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. కాబట్టి సమతుల్య ఆహారం తీసుకుంటూ.. హైడ్రేటెడ్​గా ఉండేలా చూసుకోవాలి.

ఇలాంటి హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.