వాతావరణం మారిందంటే చాలు వెంటనే దాని ప్రభావం శరీరంపై పడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టేది జలుబు, ముక్కు దిబ్బడ. జ్వరం కంటే కూడా జలుబు మనిషిని ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తుంది. తల నొప్పి, గొంతు నొప్పి రావడం వల్ల ఏది తినాలన్నా ఇష్టంగా ఉండదు. గొంతు నొప్పి కారణంగా కనీసం మంచి నీళ్ళు కూడా తాగడానికి ఇబ్బంది పడతారు. అందుకే అటువంటి సమయంలో వీటిని తింటే మీకు కడుపు నిండుగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది అనిపించదని అంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు అగర్వాల్. సరైన ఆహారం తీసుకోకపోతే రోగనిరోధక శక్తి తగ్గి ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. అందుకే  ఫ్లూ వచ్చినప్పుడు తినకుండా ఉండకూడదు. ఈ మూడు ఆహార పదార్థాలు తీసుకుంటే మీకు ఫ్లూ నుంచి రిలీఫ్ ఇవ్వడమే కాకుండా అనేక ప్రయోజనాలని అందిస్తుందని చెప్తున్నారు. 


సూప్: వేడి ద్రవాలు తీసుకోవడం చాలా మంచిదని అంటున్నారు నిపుణులు. అవి గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి. రుచిగా ఉండటమే కాకుండా ఇందులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కూరగాయలు లేదా చికెన్, మటన్ సూప్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. 


వెల్లుల్లి: జలుబు నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది అల్లం టీ తాగితే మంచి రిలీఫ్ గా భావిస్తారు. ఇదే కాదు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అందరి వంటింట్లో దొరికే సులభమైన పదార్థం ఇది. వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జలుబు, ఇన్ఫెక్షన్ తీవ్రతని తగ్గిస్తుంది. 


కొబ్బరి నీళ్ళు: జలుబుతో ఇబ్బంది పడే వాళ్ళు మంచి నీళ్ళు తాగలంటే చాలా కష్టంగా భావిస్తారు. కానీ శరీరానికి సరిపడినంత నీరు అందకపోతే డీ హైడ్రేట్ కి గురవుతాము. అందుకే తరచూ మంచి నీళ్ళు తాగుతూ ఉండాలి. కానీ జలుబు చేసిన సమయంలో నీరు తాగడం ఇబ్బంది అనుకుంటే వాటికి బదులుగా కొబ్బరి నీళ్ళు తాగడం ఉత్తమం. ఇది ఎలక్ట్రోలైట్స్ నింపడంతో పాటు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇవే కాదు సాల్మన్ చేప, గుడ్లు, చికెన్, కూరగాయలు, పండ్లు వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. 


ఇళ్ళల్లో పెద్దలు చికెన్ చారు తాగితే జలుబు చిటికెలో మటుమాయం అవుతుందని అంటుంటారు. కొద్దిగా ఘాటుగా చేసుకుని తినడం వల్ల ముక్కు నుంచి నీరు రూపంలో జలుబు పోయి మంచి ఫలితం కనిపిస్తుంది. 


జలుబు చేసినప్పుడు కాఫీ, సోడా, బ్లాక్ టీ వంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది. ఇవి శరీరాన్ని మరింత డీ హైడ్రేట్ చేస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా తినకపోవడమే బెటర్. మీరు ఎప్పుడైనా జలుబు బారిన పడితే వీటిని పాటించి చూడండి చక్కని ఫలితం కనిపిస్తుంది. 


గమనిక: పలు అధ్యయనాలుపరిశోధనలుహెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: నిద్ర శరీరానికి ఇంత అవసరమా? నిద్రలేమితో ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?


Also read: ఈ పదార్థాలు ఇచ్చిన డేట్ కంటే ముందే ఎక్స్‌పైర్ అవుతాయి , జాగ్రత్త పడండి