మనలో చాలా మందికి డబుల్ చిన్ ఉంటుంది. లావుగా ఉన్న వాళ్ళలో అది స్పష్టంగా కనిపిస్తుంది. గడ్డం కింద చర్మం లావుగా ఉండి చూసేందుకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. డబుల్ చిన్ ఉన్న వాళ్ళు కొంతమంది బయట తిరిగేందుకు అంతగా ఆసక్తి చూపించరు. అది వారి మొహం అందాన్ని చెడగొడుతుంది. మెడ పైభాగాన కొవ్వు పేరుకుపోవడం వల్ల డబుల్ చిన్ వస్తుంది. ఒక్కోసారి ఇది జన్యుపరంగా కూడా వస్తుంది. బాగా డబ్బులు ఉన్న వాళ్లయితే సర్జరీలు చేయించుకుని కొవ్వు తీసేయించుకుంటారు. డబ్బు లేని వాళ్ళు ఏమి చెయ్యలేక అలాగే ఉండిపోతారు. అయితే దీన్ని పోగొట్టుకునేందుకు సర్జరీలు దాకా వెళ్ళే బదులు ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే ఎటువంటి సమస్యలు లేకుండా సులభంగా తగ్గించుకోవచ్చు. 


ఈ వ్యాయామాలు పాటించి చూడండి 


చిన్నగా మెడ తిప్పడం: డబుల్ చిన్ సమస్య నుంచి బయటపడేందుకు ఇంట్లోనే వ్యాయామం చెయ్యొచ్చు. ప్రతి రోజు 5 నుంచి 10 నిమిషాల పాటు మెడని చిన్నగా అటు ఇటు తిప్పాలి. 


నాలుకను చాచడం: రోజంతా 10 నుంచి 15 సెకండ్ల పాటు నోట్లో నుంచి నాలుకను బయటకి చాచడం చేయాలి. ఇలా చెయ్యడం వల్ల మొహం కండరాలు బలోపేతం అవుతాయి. 


గడ్డాన్ని నొక్కడం: ఒక చిన్న బాల్ తీసుకుని దానితో గడ్డాన్ని రోజుకు రెండు సార్లు 2 నుంచి 4 నిమిషాల పాటు నొక్కాలి. 


చూయింగ్ గమ్ నవలడం: డబుల్ చిన్ పోగొట్టుకునేందుకు చూయింగ్ గమ్ నవలాలి. బాగా నవలడం వల్ల మొహంలోని కండరాలకి మంచి ఎక్సర్ సైజ్ లాగా ఉపయోగపడుతుంది. 


రోజువారీ వ్యాయామం: జిమ్ కి వెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళు రోజు చేసే వ్యాయామాల వల్ల కూడా డబుల్ చిన్ తగ్గిపోతుంది. 


ఆరోగ్యకమైన ఆహారం తీసుకోవాలి: శారీరక రుగ్మతల నుంచి బయటపడేందుకు ఉన్న చక్కటి పరిష్కారం పౌష్టికాహారం తీసుకోవడం. కాలానుగుణంగా వచ్చే ఆహార పదార్థాలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. కొవ్వు, చక్కెర తక్కువ ఉన్న పదార్థాలను మీ డైట్లో భాగం చేసుకోవాలి. పండలుమ కూరగాయలు, ధాన్యాలు అన్నీ తీసుకోవాలి. 


మసాజ్: గడ్డం కింద ఉన్న కొవ్వుని తగ్గించేందుకు మార్కెట్లో పలు రకాల సాధనాలు ఉన్నాయి. వాటితో రోజు మసాజ్ చేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల గడ్డం కింద పేరుకుపోయిన కొవ్వుని కరిగించడంతో పాటు రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: శ్రావణ మాసంలో ఈ ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకండి


Also Read: బిడ్డకు పాలివ్వడం శిశువుకే కాదు తల్లికీ ప్రయోజనమే