అదేంటీ? గుండెకు దంతాలకు లింక్ ఏమిటనేగా మీ సందేహం? అయితే, మీరు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. 


నోటిలోని దంతాలు, చిగుళ్లకు వచ్చే వ్యాధుల(పీరియాడోంటైటిస్)తో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. దంతాలు ఆరోగ్యంగా లేకపోతే రక్త ప్రవాహంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అది గుండె కవాటాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీకు కృత్రిమ గుండె కవాటాలు(artificial heart valves) ఉన్నట్లయితే నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్‌లో ప్రచురించి అధ్యయనం ప్రకారం.. డెంటల్ ఇన్ఫెక్షన్‌లకు చికిత్స పొందిన రోగుల కంటే, చికిత్స పొందని రోగులకు గుండె సమస్యలు వచ్చే ప్రమాదం 2.7 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. 


మీ నోటిలోని జ్ఞాన దంతాలు శరీరంలోని కేంద్ర నాడీ వ్యవస్థ, గుండె, కాలేయం, ప్రేగులకు అనుసంధానించి ఉంటాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియా చిగుళ్లలోని  కణజాలాల ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత శరీరమంతా వ్యాపించి గుండె కవాటాలు ద్వారా గుండెలోకి ప్రయాణించవచ్చు. ఇది గుండెపోటు, స్ట్రోక్‌కు దారితీసే ధమనుల సమస్యకు కారణమవుతుంది. 


గుండె సమస్యలు రాకకూడదంటే.. మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఈ కింది అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా దంత సమస్యలను అరికట్టవచ్చు. ‘నోరు మంచిదైతే.. మీ గుండె మంచిగా ఉంటుంది’’ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 


ఈ అలవాట్లతో దంత క్షయం నుంచి బయటపడండి


⦿ స్వీట్లు, చక్కెర ఎక్కువ ఉండే ఆహారం వద్దు: నోటిలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. చక్కెర లేదా స్వీట్స్ తినడం వల్ల మీ దంతాల బయటి రక్షణ పొరను కుళ్ళిపోయేలా చేసే హానికరమైన యాసిడ్‌ను ఉత్పత్తి అవుతుంది. అవి దంతాలను తినేస్తుంది. ఫలితంగా దంతక్షయం ఏర్పడుతుంది.
⦿ నోరు తడిగా ఉండాలి: నోటిని పొడిగా ఉంచుకోవడం అస్సలు మంచిది కాదు. నోట్లో ఎప్పుడూ లాలాజలం ఉండాలి. కాబట్టి, మీ నోరు పొడిగా ఉన్నప్పుడు నీటిని తాగండి. దీనివల్ల నోటికి అంటుకుని ఉన్న పదార్థాలు క్లీన్ అవుతాయి.
⦿ ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయండి: ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్, ఫ్లోరైడ్ కలిగిన మౌత్ వాష్‌లను ఉపయోగిస్తే దంతక్షయ సమస్యలు దరిచేరువు. ఫ్లోరైడ్ దంతాలను యాసిడ్స్ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
⦿ వస్తువులను కొరకొద్దు: డ్రింక్ సీసాల మూతలు తెరవడానికి లేదా చిప్స్, స్నాక్స్ కవర్లను చింపడానికి లేదా మరేదైన బలమైన పనికి దంతాలను ఉపయోగించొద్దు. అలాంటి పనుల వల్ల దంతాలు దెబ్బతింటాయి లేదా విరిగిపోతాయి. అది దంతక్షయానికి దారితీయొచ్చు.
⦿ ఆహారం తిన్న తర్వాత నీటిని పుక్కిలించి: ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిలో నీరు వేసుకుని బాగా పుకులించి ఊయండి. దానివల్ల దంతాల మధ్య ఇరుక్కొనే పదార్థాలు బయటకు పోతాయి. అవి అలాగే ఉండిపోతే.. అక్కడ బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది.
⦿ బాగా వేడి, లేదా బాగా చల్లని పదార్థాలను తినొద్దు: బాగా వేడిగా ఉండే ఆహరపానీయలు అస్సలు తీసుకోవద్దు. అలాగే, గడ్డకట్టిన ఐస్‌‌ను, చల్లని వస్తువులను నోటిలో పెట్టుకోవద్దు. దానివల్ల దంతాలు త్వరగా దెబ్బతింటాయి. శీతల పానీయలు ఎక్కువగా తాగొద్దు. 
⦿ పొగాకు నమలొద్దు: గుట్కా, ఖైనీ, పొగాకు నమిలే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. అవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. 


Also Read: సూపర్ మ్యాన్ సిండ్రోమ్, ఇది కూడా వ్యాధే - మీ నాన్నగారిలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!



Also Read: 11 మినిట్స్, 7 హవర్స్, త్రిపుల్ 20 - ఇవి మీ ఆయుష్సును ఏ విధంగా నిర్ణయిస్తాయో తెలుసా?