ఒకప్పుడు రోడ్ల పక్కనా, ఎక్కడ పడితే అక్కడ పెరిగేది ఈ తీగ. కానీ ఇప్పుడు భవంతులు, సిమెంట్ రోడ్లు పెరగడంతో ఎక్కడో కానీ కనిపించడం లేదు. ఈ తీగ పేరు ‘తిప్ప తీగ’.  ఆయుర్వేదం మందుల్లో అధికంగా వాడతారు. దీన్ని పొడి రూపంలో తీసుకున్నా, తమల పాకుల్లా రెండు ఆకులు నమిలినా చాలా మంచిది. దీన్ని ఆంగ్లంలో ‘గిలోయ్’ (టినోస్పోరా కార్డిఫోలియా) అంటారు. దీనిలోని సుగుణాలను పరీక్షించి, ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ధ్రువీకరించింది. సంస్కృతంలో దీన్ని "అమృతా" అంటారు. దీని తీగ, ఆకులను కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. వీటితో జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారు చేసి అమ్ముతారు. ఆరోగ్య సమస్యలను బట్టి వాటిని ఆయుర్వేద నిపుణులు సూచిస్తారు. ఏ సమస్యా లేకపోయినా రెండు ఆకులను నమిలితే మంచిదే. 


తిప్పతీగ-ఉపయోగాలు



  • తిప్పతీగతో తయారు చేసిన మందులు, పదార్థాలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి.

  • శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

  • పలు రకాల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడగల గుణాలతో పాటూ... రక్తాన్ని శుభ్రపరచడంలోనూ తిప్పతీగది ప్రధాన పాత్ర.

  • ఆయుర్వేదంలో ప్రత్యేక నిపుణులు కొందరు తిప్పతీగతో హృదయ సంబంధిత వ్యాధుల బారినపడకుండా మందులు తయారు చేస్తారు.

  • సీజనల్ వ్యాధులు విష జ్వరాలైన డెంగ్యూ, స్వైన్ ఫ్లూ మలేరియా వంటి వాటిని పూర్తిగా నివారించగల శక్తి తిప్పతీగకు ఉంటుంది.

  • జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే శక్తి తిప్పతీగకు ఉంటుంది. కాస్త తిప్పతీగ పొడిని కాస్త బెల్లంలో కలుపుకుని తింటే చాలు అజీర్తి సమస్య పోతుంది. 

  • తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది.

  • తిప్పతీగతో తయారు చేసిన మందుల్ని ఉపయోగించడం ద్వారా మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.

  • శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి తిప్పతీగ మందులు బాగా పని చేస్తాయంటారు ఆయుర్వేద నిపుణులు.

  • తిప్పతీగ పొడిని వేడి పాలలో కలుపుకుని తాగితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

  • ఈ పొడిని చల్లటి నీళ్లలో కలుపుకుని ఐలిడ్స్ పై పోసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది.

  •  ముఖంపై మచ్చలు, మొటిమలు మాత్రమే కాదు వృద్దాప్య ఛాయలు రాకుండా చేయగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. 

  • పురుషుల్లో లైంగిక సామర్థాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. 


Also Read: ఈ ఆహారాలకు ఎక్స్‌పైరీ డేటే లేదు, ఎన్నాళ్లయినా వాడుకోవచ్చు


గమనిక: ఇవన్నీ కొన్ని ఆయుర్వేద పుస్తకాలు, కొందరు ఆయుర్వేద నిపుణులను సంప్రదించి రాసిన విషయాలు. మీకు ప్రత్యేకంగా ఏదైనా సమస్య ఉంటే దీని గురించి ఆయుర్వేద నిపుణులను నేరుగా సంప్రదించి ఉపయోగించండి. అతిగా వాడినా అనారోగ్యమే. మరీ ముఖ్యంగా గర్భిణిలు, చిన్నపిల్లల తల్లులు తిప్పతీగతో తయారు చేసిన మందులు వినియోగించవద్దు. 


Also Read: విటమిన్ ట్యాబ్లెట్లు మింగుతున్నారా? అవి అకాలమరణాన్ని ఆపలేవంటున్న కొత్త అధ్యయనం