Tea Increases Beauty: మీకు రోజు ఛాయ్‌ తాగే అలవాటు ఉందా? అయితే, ఈ వార్త మీ కోసమే. ప్రతిరోజు మూడుసార్లు ఛాయ్‌ తాగే అలవాటు ఉందా? అయితే, మీకు ఇది ఇంకా పెద్ద గుడ్‌న్యూస్‌. అవునండి! ప్రతి రోజు ఛాయ్‌ తాగేవాళ్ల అందం రెట్టింపు అవుతుందని చెప్తున్నారు సైంటిస్టులు. ఛాయ్‌ మీద రిసెర్చ్‌ చేసి మరీ ఈ విషయాన్ని చెప్పారు. యూరప్‌, చైనా దేశాల్లో యువత, పెద్దవాళ్లపై రిసెర్చ్‌ చేసి, వాళ్ల బ్లడ్‌ శాంపిల్స్‌ కలెక్ట్‌ చేసి, వాటిని పరిశీలించిన తర్వాత ఈ విషయాలు వెల్లడించారు. నిజానికి టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తారు. కానీ, రిసెర్చ్‌ చేసి మరీ ఈ విషయాలు చెప్తున్నామని అన్నారు.

   


రోజుకు మూడు కప్పులు.. 


పొద్దున లేవగానే కచ్చితంగా 'టీ' పడాలి చాలామందికి. టిఫిన్‌ తిన్న తర్వాత ఒకసారి, ఇక ఆ తర్వాత సాయంత్రం మరోసారి టీ ఉండాల్సిందే. ఇక ఇప్పుడు రకరకాల ఛాయ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటిల్లో గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ, ఛాయ్‌ ఒంటికి మంచిదని చెప్తున్నారు సైంటిస్టులు. టీ యాంటీ ఏజింగ్‌కి ఉపయోగపడుతుందని చైనాకి చెందిన రిసెర్చ్‌ టీమ్‌ వెల్లడించింది. గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీలో ఉండే హెల్తీ కెమికల్స్‌ కొన్ని శరీరంలోని సెల్స్‌ కొన్ని పాడవ్వకుండా చేసి, ఏజింగ్‌పై ప్రభావం చూపిస్తాయని, అవయవాలన్నీ సరిగ్గా పనిచేసేందుకు కూడా ఉపయోగపడతాయని చెప్పారు. 


'టీ'లో చాలా బయోయాక్టివ్‌ కాంపౌండ్స్‌ ఉంటాయని, దానివల్ల యాంటీ ఏజింగ్‌ బెనిఫిట్స్‌ ఎక్కువగా ఉన్నట్లు గమనించామని సియాచిన్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ యిగ్జియాంగ్‌ చెప్పారు. అంతేకాకుండా టీ తాగడం వల్ల డయాబెటిస్‌, గుండె సంబంధిత వ్యాధులు కూడా రావని గతంలో చాలా అధ్యాయనాల్లో తేలిందని ఆమె చెప్పారు. టీలో ఉండే పాలిఫెనాల్స్‌, పవర్‌ఫుల్‌ యాంటిఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ రాకుండా, చిత్త వైకల్యం రాకుండా కాపాడతాయని చెప్పారు. 


బ్రిటన్‌కి చెందిన 37 - 73 ఏళ్ల వయసు ఉన్న 5,998 మంది, చైనాకు చెందిన 7,931 మందిపైన ఈ రిసెర్చ్‌ చేశామని సైంటిస్టులు చెప్పారు. గ్రీన్‌ టీ, ఒలాంగో టీ, బ్లాక్‌ టీ తాగేవాళ్లుపై ఈ రిసెర్చ్‌ చేసి రిపోర్ట్‌లు ఇచ్చామన్నారు. టీ ఉండే పాలిఫెనాల్స్‌ గట్‌ మైక్రోబయోటాను మాడ్యులేట్‌ చేస్తాయని, ఇది ఇమ్యూనిటీని, జీవక్రియ పనితీరును మెరుగుపరిచి, వయసు సంబంధిత మార్పులపై ప్రభావం చూపిస్తుందని యిగ్జియాంగ్ చెప్పారు. వాటితో పాటుగా.. ఉండే కెఫైన్‌,తియనైన్‌ అనే బయో యాక్టివ్‌ కాంపౌండ్స్‌ కూడా అందాన్ని పెంచుతాయి.


రోజు టీ తాగడం వల్ల.. ఒక వ్యక్తి అందం సగటున రెండేళ్ల వయసుకు తగ్గుతుందని రిసెర్చ్‌లో తేలినట్లు సైంటిస్టులు చెప్పారు. యావరేజ్‌గ రోజుకి మూడు కప్పులు తాగేవాళ్లలో ఈ మార్పు కచ్చితంగా కనిపిస్తుందని అన్నారు. అయితే, మోతాదుకు మించి తీసుకునేది ఏదైనా కచ్చితంగా హాని కలిగిస్తుందని, ఆ విషయాన్ని కూడా గమనించాలని హెచ్చరిస్తున్నారు కూడా. ఇంకేముంది.. టీ తాగేద్దాం అందం పెంచుకుందామని ఓ టీ ఎక్కువగా కూడా తొగొద్దు. దైన్నైనా కావాల్సినంత, అవసరమైనంత మాత్రనే తీసుకుంటే మంచిది. 


Also Read: మళ్లీ ఉనికిలోకి 48,500 నాటి మహమ్మారి - ప్రపంచానికి మరో అతి పెద్ద ముప్పు?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.