Stock Market News Today in Telugu: శుక్రవారం నష్టాల్లో ముగిసిన ఇండియన్‌ స్టాక్ మార్కెట్లు, ఈ రోజు (సోమవారం, 29 జనవరి 2024) ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. బ్యాంక్ నిఫ్టీలోనూ జోరు కనిపించింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు, బడ్జెట్ వారంలోని బుల్లిష్‌నెస్‌ తోడవడంతో మన మార్కెట్‌ మెరుగ్గా కనిపిస్తోంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 1న ప్రభుత్వం బడ్జెట్‌ను సమర్పిస్తుంది. ఫిబ్రవరి F&O సిరీస్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది, ఆ ఉత్సాహం కూడా మార్కెట్‌కు తోడైంది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (శుక్రవారం) 70,701 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 267.43 పాయింట్లు లేదా 0.38 శాతం పెరుగుదలతో 70,968.10 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. శుక్రవారం 21,353 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 80.50 పాయింట్లు లేదా 0.38 శాతం జంప్‌తో 21,433.10 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


బ్రాడర్‌ మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.4 శాతం & 0.8 శాతం వరకు పెరిగాయి.


మార్కెట్‌ ప్రారంభ సమయంలో... సెన్సెక్స్30 ప్యాక్‌లోని 25 స్టాక్స్‌ గ్రీన్‌ జోన్‌, 5 స్టాక్స్‌ రెడ్‌ జోన్‌లో ఉన్నాయి. సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో... సన్ ఫార్మా 2.55 శాతం లాభపడింది. NTPC 1.72 శాతం, పవర్ గ్రిడ్ 1.63 శాతం, కోటక్ మహీంద్ర బ్యాంక్ 1.59 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.52 శాతం ర్యాలీ చేశాయి. మరోవైపు... ITC, JSW స్టీల్‌, ఇన్ఫోసిస్‌ స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.


నిఫ్టీ50 ప్యాక్‌లోని 40 స్టాక్స్ లాభపడగా, 10 స్టాక్స్ పతనంలో ఉన్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5.09 శాతం, ఓఎన్‌జీసీ 4.17 శాతం లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ 3.74 శాతం, సన్ ఫార్మా 3.05 శాతం, ఎస్‌బీఐ లైఫ్ 2.44 శాతం బలాన్ని ప్రదర్శిస్తున్నాయి.


- 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఆర్డర్‌ను SJVN గెలుచుకోవడంతో, ఆ స్టాక్‌ 6% పెరిగింది. 


- Q3 ఫలితాలు బాగుండడంతో అదానీ పవర్ 3% పెరిగింది


- AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ Q3 నంబర్లు మార్కెట్‌ను ఆకట్టుకోకపోవడంతో, బ్యాంక్‌ షేర్లు దాదాపు 10% పతనమయ్యాయి.


- Q3 రిజల్ట్స్‌ తర్వాత మార్కెట్‌ ఎనలిస్ట్‌ల నుంచి డౌన్‌గ్రేడ్‌లు ఎదుర్కొన్న SBI కార్డ్ 5% తగ్గింది. 


- అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $84 స్థాయికి చేరడంతో, ONGC స్టాక్‌ 4% పెరిగింది. 


ఈ రోజు ఉదయం 10.00 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 743.50 పాయింట్లు లేదా 1.05% రాణించి 71,444.17 దగ్గర; NSE నిఫ్టీ 235 పాయింట్లు లేదా 1.10% పెరిగి 21,587.60 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో.. ఈ ఉదయం హాంగ్ సెంగ్ 1.5 శాతానికి పైగా పెరిగింది. కోస్పి 1 శాతం, నికాయ్‌ 0.8 శాతం లాభంలో ఉన్నాయి. షాంఘై, స్ట్రెయిట్స్ టైమ్స్, తైవాన్ కూడా హయ్యర్‌ సైడ్‌లో స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ద్రవ్యోల్బణం గణాంకాలు పెరగడంతో శుక్రవారం US మార్కెట్‌ మిశ్రమంగా ముగిసింది. డౌ జోన్స్ 0.2 శాతం పెరిగితే.. S&P 500, నాస్‌డాక్ వరుసగా 0.1 శాతం, 0.4 శాతం పడిపోయాయి.


US బెంచ్‌మార్క్‌ 10-ఇయర్స్‌ బాండ్‌ ఈల్డ్‌ 4.141 శాతానికి పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ $83 పైకి చేరింది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ప్రపంచ సంపన్నుడు బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ - టాప్‌-10లో 9 మంది వాళ్లే