తిగా తినడం, మసాలాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం, టైమ్ దాటిన తర్వాత తినడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి. గుండెల్లో మంట లేదా ఎసిడిటీకి కారణమవుతుంది. ఇలా ఉన్నపుడు పొట్టలో బాగా అసౌకర్యంగా అనిపిస్తుంది. చికిత్స చేయకపోతే తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ట్యాబ్లెట్స్ వేసుకోవడం, యాంటాసిడ్స్ తాగడం వంటివి చేస్తారు. అయితే ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదు. మందులతో కాకుండా సహజమైన యాంటాసిడ్స్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటే అకస్మాత్తుగా వచ్చే గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యను తగ్గించుకోవచ్చు. అవేంటంటే..


చల్లని పాలు


చల్లటి పాలు తాగడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ ని తక్షణమే నయం చేస్తుంది. అందుకు కారణం ఇందులో అధిక మొత్తంలో కాల్షియం ఉండటం. ఇది యాసిడ్ ని గ్రహించి గ్యాస్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. వాస్తవానికి వేడి పాలు కాకుండా చల్లని పాలు తీసుకోవడం మంచిది. ఇది జీర్ణ ఆమ్లాన్ని గ్రహించి అసౌకర్యం, నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.


చమోమిలీ టీ


చామంతి పూల టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. అజీర్ణ సమస్యల నుంచి బయట పడేయడంలో అన్ని విధాలుగా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. యాసిడ్ రిఫ్లక్స్, అకస్మాత్తుగా ఎసిడిటీ వల్ల కలిగే నొప్పిని నయం చేస్తుంది.


పండిన అరటిపండు


పొటాషియం అధికంగా ఉండే పండిన అరటి పండ్లు తీసుకోవడం వల్ల ఎసిడిటీ బాధ నుంచి బయటపడొచ్చు. ఈ పండు ఆల్కలీన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది గుండెల్లో మంటని తగ్గించడంలో సహాయపడుతుంది. అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ డైటేటిక్స్ ప్రకారం పండిన అరటి పండు తీసుకోవడం వల్ల జీర్ణ ఆమ్లంతో పోరాడుతుంది. అన్నవాహికలో కలిగే చికాకుని తగ్గిస్తుంది.


తులసి ఆకులు


ఎన్నో ఔషధ గుణాలు కలిగిన తులసి ఆకులు రోజుకి రెండు నమిలితే అజీర్తి సమస్యలు దరిచేరవు. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, ఉబ్బరం వల్ల కలిగే అసౌకర్యాన్ని నయం చేసే గొప్ప గుణాలు ఇందులో ఉన్నాయి. తులసిలో యాంటీ అల్సర్ లక్షణాలు ఉన్నాయి. వీటిని టీ లేదా పచ్చి ఆకుల రూపంలో తీసుకుంటే పొట్టలోని ఆమ్ల స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.


అల్లం


అల్లంలో యాంటీ మెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది వికారం, వాంతులు వంటి అనుభూతిని నివారించడంలో సహాయపడుతుంది. పాలు లేని అల్లం టీని తాగడం వల్ల ఎసిడిటీ వల్ల కలిగే మంట, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే రోజు మొత్తం మీద 3-4 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తినకుండా చూసుకోవాలి. అతిగా అల్లం తీసుకుంటే అది మరొక అనారోగ్య సమస్యని తీసుకొచ్చి పెడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: పెరుగుతో ఫేస్ ప్యాక్ - మీ వయస్సు వెనక్కి వెళ్లడం ఖాయం!