టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మైయోసైటిస్ నుంచి కోలుకుంటోంది. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఆమె తమిళనాడులోని పళని మురుగన్ ఆలయానికి వెళ్లింది. సల్వార్ కమీజ్ ధరించిన సమంత ఆలయంలోని 600 మెట్లు ఎక్కి వెళ్లింది. ప్రతి మెట్టుకో ఓ హారతి కర్పూరం వెలిగించింది. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. ఆమె వెంట దర్శకుడు సి ప్రేమ్ కుమార్‌తో పాటు కొంత మంది సినీ నటులు ఉన్నారు. సమంత తనకు మైయోసిటిస్ వ్యాధి సోకినట్లు 2022లో వెల్లడించింది. చికిత్సలో భాగంగా ప్రతి నెలా ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ (ఐవిఐజి) సెషన్‌లను తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సమస్య నుంచి పూర్తిగా బయటపడే స్థితిలో ఉన్నట్లు వెల్లడించింది. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు మానసిక ప్రశాంతత కోసం ఆలయాన్ని సందర్శించింది.






ఏప్రిల్ 14న సమంత ‘శాకుంతలం’ విడుదల


ప్రస్తుతం సమంతా, గుణ శేఖర్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని కారణాలతో పోస్ట్ పోన్ చేశారు. ఇప్పటికి ఈ సినిమా రెండుసార్లు వాయిదా పడింది. గతంలో 3డీ పనుల కారణంగా సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు ప్రకటించారు. ఈ చిత్రంలో నటులు దేవ్ మోహన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  


Read Also: షారుఖ్‌కు ముద్దు పెట్టిన నయనతార, ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో తెలుసా?