చాలామంది ‘తొక్కలే’ అంటూ తొక్కలను చాలా చీప్‌గా చూస్తారు. ఏదైనా వేస్ట్ అని చెప్పడానికి ‘తొక్కలో’ అనే తిట్టును వాడతారు. అయితే, ఇతడు మాత్రం.. ఆ ‘తొక్క’కు విలువ పెంచేశాడు. ఆరెంజ్ తొక్కలతో అందమైన లగ్జరీ హ్యాండ్ బ్యాగ్‌లు తయారు చేస్తున్నాడు. వీటిని చూడగానే ఖరీదైన లెదర్ బ్యాగ్గుల్లా కనిపిస్తాయి. వీటి కలర్ కూడా చాలా బాగుంటుంది. 


ఇంతకీ ఈ పర్సులు తయారు చేస్తున్న ఆ కళాకారుడి గురించి చెప్పనే లేదు కదూ. అతడి పేరు.. ఒమర్ సర్తావి. జోర్దాన్‌కు చెందిన ఒమర్.. మాంచి ‘ఫుడ్ ఆర్టిస్ట్’, మాలిక్యులర్ గ్యాస్ట్రోనమిస్ట్ కూడా. అతడి ఆరెంజ్ తొక్కల్లో ఏం కనిపించిందో ఏమో.. వాటిని బ్యాగ్ తయారీకి వాడాలని భావించాడు. ఆ ఆలోచన రావడమే తరువాయి.. తాజా తొక్కలను సేకరించి బ్యాగ్‌లు తయారు చేయడం మొదలుపెట్టాడు. దీన్ని అతడు ‘డిజిటల్ ఫ్యాబ్రికేషన్’ అని పిలుస్తున్నాడు. ఒమర్ లేజర్ సాయంతో ఆరెంజ్ తొక్కలను చక్కని షేపుల్లో కట్ చేసి ఈ బ్యాగ్‌లను తయారు చేస్తున్నాడు. ఆ బ్యాగ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను అతడు ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. 


‘‘ఈ బ్యాగ్ తయారీ కోసం ఎన్నాళ్ల నుంచో ప్రయోగాలు చేస్తున్నా. ఎన్నో ప్రయత్నాలు, ఎర్రర్స్ తర్వాత.. ‘ఆరెంజ్ పీల్స్ లేదర్ బ్యాగ్’ను అందంగా తయారు చేయగలిగాను’’ అని తెలిపాడు. అయితే, తొక్కలతో చేసిన బ్యాగ్ ఎన్నాళ్లు ఉంటుందనేగా మీ సందేహం? అయితే, దాని గురించి మాత్రం అతడు చెప్పలేదు. బహుశా.. అతడి అతడి ట్రేడ్ సీక్రెట్ కావచ్చు. ఏది ఏమైనా మనం అతడిని ప్రతిభను మాత్రం మెచ్చుకోవల్సిందే. నెటిజనులు కూడా ఈ బ్యాగ్‌ను చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు. దీనికి ‘Citrus’ అనే బ్రాండ్ నేమ్ పెట్టాలని నెటిజనులు సూచిస్తున్నారు.














Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్


Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!


Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)


Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి